Running Tips: రన్నింగ్‌ చేసేటప్పుడు వీటిపై శ్రద్ధ పెట్టండి.. లేదంటే చాలా నష్టం..!

Running Tips: రన్నింగ్‌ చేసేటప్పుడు వీటిపై శ్రద్ధ పెట్టండి.. లేదంటే చాలా నష్టం..!

Update: 2022-11-30 04:30 GMT

Running Tips: రన్నింగ్‌ చేసేటప్పుడు వీటిపై శ్రద్ధ పెట్టండి.. లేదంటే చాలా నష్టం..!

Running Tips: నేటి కాలంలో చాలా మంది ఊబకాయంతో బాధపడుతున్నారు. పొట్ట తగ్గాలంటే కచ్చితంగా వ్యాయామం చేయాల్సిందే. అయితే అందరు జిమ్‌కి వెళ్లడం సాధ్యం కాదు. కాబట్టి పార్కులు, గ్రౌండ్స్‌లో పరుగులు తీయడానికే ఇష్టపడుతారు. రన్నింగ్ అనేది బెల్లీ ఫ్యాట్‌ను తగ్గిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అలాగే గుండె జబ్బులను నివారిస్తుంది. కానీ చాలా మంది పరిగెత్తేటప్పుడు కొన్ని పొరపాట్లు చేస్తారు. దీని వల్ల వారు సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

పరిగెత్తేటప్పుడు సమస్యలు

రన్నింగ్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే కొన్నిసార్లు రన్నర్ కూడా గాయాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనే ఉత్సాహంతో తప్పుడు మార్గంలో ఎప్పుడు పరుగెత్తకండి. ఇలా చేయడం వల్ల చాలా హాని జరుగుతుంది.

1. చీలమండలో వాపు

రన్నింగ్‌ చేసేటప్పుడు చీలమండల వెనుక కండరాలు ఉబ్బడం, సాగడం జరుగుతుంది. ఈ సమస్య సాధారణమైనప్పటికీ దీనిని నివారించడం అవసరం. వేగంగా పరుగెత్తడం వల్ల ఇది జరుగుతుంది.

2. అరికాలిలో నొప్పి

రన్నింగ్‌ చేసేటప్పుడు సరైన షూస్‌ ధరించాలి. లేదంటే అరికాళ్ళలో నొప్పిని కలిగిస్తుంది. లేదంటే ఆస్పత్రి పాలు కావాల్సి వస్తోంది.

3. మోకాలిలో నొప్పి

చాలా సార్లు మనం అవసరమైన దానికంటే వేగంగా రన్నింగ్‌ చేస్తాం. దీని కారణంగా మోకాలిలో నొప్పి ఏర్పడుతుంది. దీనిని పటెల్లోఫెమోరల్ పెయిన్ సిండ్రోమ్ అని పిలుస్తారు. అందుకే కాస్త జాగ్రత్త అవసరం.

4. రన్నింగ్‌కి ముందు చేయాల్సినవి..

రన్నింగ్‌కి ముందు కండరాలు, శరీరాన్ని సాగదీయాలి. ఎక్సర్‌ సైజెస్‌ చేయాలి. మధ్యలో 2 నుంచి 5 నిమిషాలు విశ్రాంతి ఇవ్వాలి. వేగంగా రన్నింగ్‌ చేయకూడదు. సౌకర్యవంతమైన బూట్లు ధరించాలి. ఎగుడుదిగుడుగా దిగుడుగా ఉన్న ప్రాంతంలో రన్నింగ్‌ చేయకూడదు. మొబైల్, ఇయర్‌ఫోన్‌లను ఉపయోగించకూడదు.

Tags:    

Similar News