Parenting Tips: మీ పిల్లలతో ఇలాంటి మాటలు అస్సలు అనకూడదు
Parenting Tips:పిల్లలను పెంచే విషయంలో పేరేంట్స్ కొన్ని విషయాలు తప్పకుండా తెలుసుకోవాలి. ఎందుకంటే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. చిన్నవయస్సులోనే వారిని సరైన క్రమంలో పెంచితే పెద్దయ్యాక ప్రయోజకులు అవుతారు. అసలు పిల్లల ముందు తల్లిదండ్రులు ఎలాంటి మాటలు మాట్లాడకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
Parenting Tips:పిల్లలను పెంచే తల్లిదండ్రులు కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వారితో ఎలాంటి మాటలు మాట్లాడాలి.ఎలాంటి మాటలు మాట్లాడకూడదు. ఇలాంటి విషయాలు తెలసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే మనం మాట్లాడే ప్రతి మాటా పిల్లవాడిపై ఎఫెక్ట్ చూపుతాయి. అవేంటో చూద్దాం.
ఫెయిల్ అవుతావు:
పిల్లల్లందరూ ఒకేలా ఉండరు. కొందరు యాక్టివ్ గా ఉంటారు. ఇంకొందరు కాస్తా డల్ గా ఉంటారు. అంతమాత్రాన మీరు ఎప్పుడూ ఇంతే ఏం సాధించలేరు..అన్నింట్లోనూ ఫెయిల్ అవుతారు..ఇలాంటి మాటలను పిల్లల ముందు అస్సలు అనకూడదు. దీని వల్ల వారిలో ఆత్మవిశ్వాసనం సన్నగిల్లుతుంది. కాన్ఫిడెన్స్ అనేది దెబ్బతింటుంది.
మీకేం తెలియదు:
చిన్నపిల్లలు మీకేం తెలియదు..ఇలాంటి మాటలు అనకూడదు. ఎందుకంటే వారు ఏమైనా మనకు చెప్పాలనుకున్నప్పుడువాటిని పూర్తిగా చెప్పలేరు. అందుకే ఏవైనా చెప్పే ధైర్యం వారిలో కలిగించాలి.
ఇతరులతో పోలిక:
పిల్లలను ఎప్పుడూ కూడా ఇతరులతో పోల్చకూడదు. వాళ్లకు మంచి మార్కులు వచ్చాయి..వీళ్లు ఇది చేస్తున్నారంటూ అనకూడదు. మీరేం చేయలేరా అని వారితో పోల్చడం సరికాదు. వారి తప్పులు ఉంటే వారికే నిదానంగా చెప్పండి. సరిదిద్దే ప్రయత్నాలు చేయాలి.
లింగభేదం:
అమ్మాయిలు ఇవి మాత్రమే చేయాలి..అబ్బాయిలు అలాగే ఉండాలి..అనేమాటలు వారి ముందు అనకూడదు. వీటి వల్ల వారికి చిన్న వయస్సులోనే అసమానతలు చెలరేగుతాయి. అందుకే అలా అనకుండా వారిని వారిలాగే ట్రీట్ చేయాలి.