Reheating: ఈ మూడు పదార్థాలను వేడిచేసి తింటున్నారా? అయితే ఈ వ్యాధులను ఆహ్వానించినట్లే
Reheating: సాధారణంగా మన ఇళ్లలో మిగిలిన పదార్థాలను ఫ్రిజ్ లో పెట్టి తెల్లవారి వేడి చేసుకుని తింటుంటాం. చాయ్, నూనె, కూరలు, అన్నం వంటివి వేడి చేస్తుంటాం. కానీ వీటిని వేడి చేసుకుని తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు తెలుస్తే మీరు షాక్ అవుతారు. ముఖ్యంగా నూనె, చాయ్, పాలకూర ఈ మూడింటిని అస్సలు వేడి చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతన్నారు. అలా వేడి చేసుకుని తినడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటో చూద్దాం.
Reheating: కొన్ని ఆహారపదార్థాలు, పానీయాలను అస్సలు వేడి చేయకూడదు. వాటిని మళ్లీ మళ్లీ వేడి చేసుకుని తింటే అనారోగ్యం తప్పదు. ఎలాంటి పదార్థమైనా తాజాగా, వేడిగా ఉన్నప్పుడు తింటేనే ఆరోగ్యానికి మంచిది. చల్లారిన తర్వాత వేడి చేసుకుని తింటే అనేక నష్టాలు తప్పవు.చాయ్, నూనె, పాలకూర వంటివి ఈ మూడింటిని ఎందుకు వేడి చేయకూడదో న్యూట్రిషనిస్టులు తెలిపారు. వాటిని వేడి చేసి తినడం వల్ల ఎలాంటి వ్యాధులు వస్తాయో చూద్దాం.
చాయ్ వేడి చేసుకుని తాగడం
చాయ్ ని వేడి చేసుకుని తాగినట్లయితే అందులోని పోషకాలన్నీంటిని కోల్పోతాము. గ్రీన్ టీలో కాటెచినస్ వంటి ముఖ్యమైన కొన్ని యాంటీ ఆక్సిడెంట్లు క్షిణిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
టానిన్లు ఏర్పడతాయి
చాయ్ తిరిగి వేడిచేసినప్పుడు టానిన్ల సాంద్రత పెరుగుతుంది. దీంతో టీ మరింత చేదుగా అవుతుంది. టానిన్లు హానికరం కానప్పటికీ..అధికంగా తీసుకుంటే ఐరన్ వంటి కొన్ని పోషకాలకు ఆటంకం కలుగుతుంది.
నూనె వేడి చేస్తే..
నూనెను వేడి చేస్తే ఆల్డిహైడ్లు, ట్రాన్స్ ఫ్యాట్స్ వంటి హానికరమైన సమ్మేళనాలు ఏర్పడతాయి. ఈ సమ్మేళనాలు క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు,ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతాయి. నూనెలను పదే పదే వేడి చేస్తే ఆక్సీకరణకు గురువుతాయి. ఇది ఫ్రీ రాడికల్స్ ఏర్పడటానికి దారి తీస్తుంది. శరీరంలో ఆరోగ్యకరమైన కణాలను దెబ్బతీస్తుంది. ఇన్‌ఫ్లమేటరీ వంటి పలు రకాల వ్యాధులకు దోహదం చేస్తుంది.
పాలకూరను వేడి చేస్తే
పాలకూరలో నైట్రేట్లు అధిక మోతాదులో ఉంటాయి. వీటిని తిరిగి వేడిచేస్తే నైట్రెట్లుగా మారుతాయి. ముఖ్యంగా ఎక్కువ సేపు స్టోరీ చేసిన తర్వాత నైట్రేట్లు కాస్త నైట్రోసమైన్లుగా మారుతాయి. వీటినలో కొన్ని క్యాన్సర్ కారకాలుగా ఉంటాయి. పాలకూరను వేడి చేస్తే కొన్ని విటమిన్లు, సున్నితమైన పోషకాలను కోల్పోయే అవకాశం ఉంటుంది.