Winter Good Foods: చలికాలంలో మిల్లెట్స్‌ గుడ్‌ఫుడ్‌.. ఎందుకంటే శరీరంలో వీటిలోపం ఏర్పడదు..!

Winter Good Foods: నేటి కాలంలో చిరు ధాన్యాలు అత్యంత శక్తివంతమైన ఆహారంగా చెప్పాలి. ఎందుకంటే వీటిలో పోషకాలకు కొదువ ఉండదు.

Update: 2024-01-18 01:52 GMT

Winter Good Foods: చలికాలంలో మిల్లెట్స్‌ గుడ్‌ఫుడ్‌.. ఎందుకంటే శరీరంలో వీటిలోపం ఏర్పడదు..!

Winter Good Foods: నేటి కాలంలో చిరు ధాన్యాలు అత్యంత శక్తివంతమైన ఆహారంగా చెప్పాలి. ఎందుకంటే వీటిలో పోషకాలకు కొదువ ఉండదు. పోషకాహారలోపంతో బాధపడుతున్న పిల్లలకు ఇవి ఒక వరంలాంటివి. పూర్వకాలంలో వీటిని ఎక్కువగా తినేవారు పండించేవారు. కానీ నేటికాలంలో చాలామందికి వీటి విలువ తెలియదు. అంతేకాకుండా రైతులు కూడా వాణిజ్య పంటలే వేస్తున్నారు కానీ చిరు ధాన్యాలను పండించడం తక్కువ చేశారు. చలికాలంలో చిరు ధాన్యాలతో చేసిన ఆహార పదార్థాలు తినడం వల్ల శరీరానికి చాలా మంచి జరుగుతుంది. దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం.

జొన్న, బార్లీ, రాగి మొదలైన వాటిని తినడం వల్ల శరీరం వెచ్చగా ఉంటుంది. వీటిలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. కఠినమైన చలికాలంలో ఈ మిల్లెట్లను ఆహారంలో చేర్చుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలంగా తయారవుతుంది. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, జలుబు, ఫ్లూ వంటి సమస్యల నుంచి మనలను రక్షిస్తాయి. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.

మిల్లెట్లను ఎలా తినాలి..?

జొన్న, బార్లీ, రాగులు, మొక్కజొన్న మొదలైన మిల్లెట్లను రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. వీటితో చాలా ఆహారపదార్థాలు తయారుచేయవచ్చు. రోటీలు, పరాటాలు, ఇడ్లీలు, ఖీర్, హల్వా మొదలైనవాటిని తయారు చేసుకోవచ్చు. చలికాలంలో వీటి వినియోగం మరింత మేలు చేస్తుంది. మీరు ఈ మిల్లెట్ రోటీలను పెరుగు, నెయ్యి లేదా చట్నీతో అల్పాహారంగా తీసుకోవచ్చు. మీరు డిన్నర్‌లో మిల్లెట్‌లతో చేసిన వస్తువులను చేర్చుకోవచ్చు,

మిల్లెట్స్‌లో గుండె జబ్బులకు మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ పుష్కలంగా లభిస్తాయి. యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని కణాలకు నష్టం జరగకుండా నిరోధిస్తాయి. అలాగే ఫైబర్ కొలెస్ట్రాల్ పెరగకుండా నిరోధిస్తుంది. అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులకు ప్రధాన కారణం. మిల్లెట్ల వినియోగం గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News