Health Tips: రూట్ వెజిటేబుల్స్ చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

Health Tips: రూట్‌ వెజిటెబుల్స్‌ లేదా దుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి.

Update: 2023-02-28 13:30 GMT

Health Tips: రూట్ వెజిటేబుల్స్ చాలా ఆరోగ్య సమస్యలకి పరిష్కారం.. ప్రయోజనాలు తెలుసుకోండి..!

Health Tips: రూట్‌ వెజిటెబుల్స్‌ లేదా దుంపలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటి ప్రత్యేకత ఏంటంటే ఇవి నేలకింద పండుతాయి. దీనివల్ల విటమిన్లు, ఖనిజాలతో సహా అనేక ముఖ్యమైన పోషకాలని కలిగి ఉంటాయి. ప్రాచీన కాలం నుంచి వేరు కూరగాయలు పోషకాహారానికి ప్రధాన వనరుగా ఉన్నాయి. వీటిని వివిధ వంటకాలలో ఉపయోగిస్తారు. రూట్ వెజిటేబుల్స్‌లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, బంగాళదుంపలు, క్యారెట్లు, అల్లం, బీట్‌రూట్ మొదలైనవి ఉంటాయి. వేరు కూరగాయలు తీసుకోవడం వల్ల శరీరానికి ఎలాంటి లాభాలు కలుగుతాయో తెలుసుకుందాం.

1. పోషకాహారం సమృద్ధిగా

రూట్ వెజిటేబుల్స్ లో విటమిన్లు, మినరల్స్, ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. విటమిన్లు ఎ, బి, సి, ఫోలేట్‌లను తయారు చేయడానికి శరీరం ఉపయోగించే బీటా-కెరోటిన్‌ పుష్కలంగా లభిస్తుంది. అదనంగా పొటాషియం, మెగ్నీషియం, ఇతర నేల ఆధారిత పోషకాలు ఉంటాయి.

2. త్వరగా చెడిపోవు

రూట్ వెజిటేబుల్స్ ప్రత్యేకత ఏంటంటే త్వరగా పాడవకుండా ఉంటాయి. ఎక్కువ కాలం తాజాగా ఉంటాయి. చల్లని ఉష్ణోగ్రత వద్ద రిఫ్రిజిరేటర్‌లో ఉంచినట్లయితే అవి వారాలపాటు తాజాగా ఉంటాయి.

3. గుండెకు ఆరోగ్యకరం

రూట్ వెజిటబుల్స్ గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం రూట్ వెజిటేబుల్స్ గుండె జబ్బుల నుంచి రక్షించడంలో సూపర్‌గా పనిచేస్తాయి.

4. పొట్టను శుభ్రంగా చేస్తాయి

మీరు మలబద్ధకం సమస్యతో బాధపడుతుంటే వేరు కూరగాయలు చాలా సహాయపడతాయి. ఎందుకంటే ఇవి కడుపుని శుభ్రంగా చేస్తాయి. రూట్ వెజిటేబుల్స్‌లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పొట్టను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతాయి.

5. ఏడాది పొడవునా అందుబాటులో

రూట్ వెజిటేబుల్స్ ఏడాది పొడవునా లభిస్తాయి. నచ్చినప్పుడు మీరు వీటిని తినవచ్చు. సీజన్ కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు. అంతేకాదు చాలా తక్కువ ధరలో లభిస్తాయి.

Tags:    

Similar News