Health Tips: కొలస్ట్రాల్ నియంత్రించడానికి జీవనశైలిలో ఈ మార్పులు చేస్తే చాలు..!
Health Tips: శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి కొలెస్ట్రాల్ అవసరం ఉంటుంది.
Health Tips: శరీరాన్ని ఫిట్‌గా ఉంచడానికి కొలెస్ట్రాల్ అవసరం ఉంటుంది. ఇది ఒక మైనపు లాంటి పదార్థం. ఇది మన సిరల్లో ఉంటుంది. అయితే కొలెస్ట్రాల్ ఎప్పుడైతే ఎక్కువ అవుతుందో అప్పుడే సమస్య మొదలవుతుంది. దీని వల్ల శరీరంలో రక్తం, ఆక్సిజన్ సరఫరాలో అవరోధం ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని సకాలంలో నియంత్రించకపోతే తరువాత గుండెపోటు వచ్చే ప్రమాదం ఉంటుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించే చర్యల గురించి ఈరోజు తెలుసుకుందాం.
ఊబకాయం
వైద్యుల ప్రకారం ఊబకాయం కొలెస్ట్రాల్ పెరుగుదలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంటుంది. లావుగా ఉన్నవారిలో కొలెస్ట్రాల్ స్థాయి ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు బరువు తగ్గించుకోవడానికి రన్నింగ్‌పై దృష్టి పెట్టాలి. ఇలా చేయడం వల్ల ఈ సమస్యను నివారించవచ్చు.
మద్యానికి దూరం
ఆల్కహాల్ తాగే వారు ఒక్కసారిగా అనేక రోగాలను ఆహ్వానిస్తున్నారు. ఆల్కహాల్ కారణంగా వారి కొలెస్ట్రాల్ స్థాయి పెరగడమే కాకుండా కిడ్నీ ఫెయిల్యూర్, గుండెపోటు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి వ్యక్తులు మద్యం తాగడం ఆపలేకపోతే కనీసం దాని పరిమాణాన్ని అయినా తగ్గించాలి.
ధూమపానం
శరీరంలో కొలెస్ట్రాల్ పెరగడానికి బీడీ-సిగరెట్ తాగడం కూడా ఒక ప్రధాన కారణం. దీని కారణంగా శరీరంలోని ధమనులలో కొలెస్ట్రాల్ గట్టిపడుతుంది. దీని కారణంగా రక్త సరఫరాలో అవరోధం ఏర్పడుతుంది. అందుకే ప్రజలు ఈ సమస్యను వదిలేస్తే మేలు జరుగుతుంది.
చెమట అవసరం
శరీరం నుంచి చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి చెమట కూడా అవసరమవుతుంది. దీని కోసం మనం జిమ్, యోగా లేదా జాగింగ్ సహాయం తీసుకోవచ్చు. చెమటతో పాటు చెడు కొలెస్ట్రాల్ కూడా శరీరం నుంచి బయటకు వస్తుందని దాని వల్లే శరీరం ఫిట్‌గా ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.