Low Blood Pressure: లో బీపీ కూడా ప్రమాదకరమే.. అందుకే ఈ చిట్కాలు..!

Low Blood Pressure: తప్పుడు జీవనశైలి, ఆహార పద్దతులు, సమయానికి నిద్రపోకపోవడం, సెల్‌ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించడం వంటి మొదలైన కారణాల వల్ల లోబీపీ సమస్య ఏర్పడుతుంది.

Update: 2023-01-21 13:30 GMT

Low Blood Pressure: లో బీపీ కూడా ప్రమాదకరమే.. అందుకే ఈ చిట్కాలు..!

Low Blood Pressure: తప్పుడు జీవనశైలి, ఆహార పద్దతులు, సమయానికి నిద్రపోకపోవడం, సెల్‌ఫోన్‌ ఎక్కువగా ఉపయోగించడం వంటి మొదలైన కారణాల వల్ల లోబీపీ సమస్య ఏర్పడుతుంది. దీనివల్ల ఎక్కువగా తలనొప్పి వస్తుంది. బీపీ తక్కువగా ఉన్నప్పటికీ కొన్ని చిట్కాల ద్వారా ఇంట్లోనే పెంచుకోవచ్చు. శరీరంలో ఒత్తిడి స్థాయి 90/60 mm hg కంటే తక్కువగా ఉంటే అది హైపోటెన్షన్ సమస్యగా చెబుతారు. అంటే తక్కువ బీపీ అని అర్థం. అధిక బీపీ మాదిరి తక్కువ బీపీ కూడా చాలా ప్రమాదకరం.

హిమాలయన్ ఉప్పు: తక్కువ రక్తపోటు మిమ్మల్ని బాధపెడితే మీరు తలనొప్పి, వికారం వంటి లక్షణాలను అనుభవిస్తారు. బీపీని వెంటనే చెక్ చేసుకోవాలి. లెవెల్ తగ్గితే ఆయుర్వేదం ప్రకారం ఉప్పు తీసుకోవాలి.

ఉసిరి : తక్కువ రక్తపోటు వల్ల చాలా మందికి తలతిరుగుతుంది. ఈ స్థితిలో ఉసిరి రసంలో తేనె మిక్స్ చేసి తాగాలి. చిటికెలో ఉపశమనం పొందుతారు.

ఖర్జూరం రెసిపీ: తరచుగా తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు ఖర్జూరం, పాలు తీసుకోవాలి. ఖర్జూరాన్ని ఒక గ్లాసు పాలలో వేసి మరిగించి తాగాలి. ఈ పద్ధతిని అనుసరించడం వల్ల చాలా కాలం పాటు ఈ సమస్య నుంచి దూరంగా ఉండవచ్చు.

ద్రవపదార్థాలు అవసరం: తక్కువ రక్తపోటు సమస్య ఉన్నవారు ఎక్కువగా ద్రవ పదార్థాలను తీసుకోవాలి. ఎందుకంటే ఇది రక్త పరిమాణాన్ని పెంచుతుంది. నిజానికి పొటాషియం ఉన్న ద్రవాల వల్ల తక్కువ బీపీ సమస్యను తగ్గించవచ్చు.

Tags:    

Similar News