Sugar: నికోటిన్, కెఫిన్ లాగే చక్కెర కూడా చాలా డేంజర్.. స్లో పాయిజన్..

Sugar: నూనె, నెయ్యి, వెన్న, నికోటిన్, కెఫిన్ వంటివి మన ఆరోగ్యానికి చాలా హానికరం.

Update: 2021-11-10 15:15 GMT

చెక్కర అతిగా వాడడం ప్రమాదకరం (ఫైల్ ఇమేజ్)

Sugar: నూనె, నెయ్యి, వెన్న, నికోటిన్, కెఫిన్ వంటివి మన ఆరోగ్యానికి చాలా హానికరం. తాజాగా ఇప్పుడు కార్బోహైడ్రేట్లు, చక్కెరలు కూడా ఈ లిస్టులో చేరాయి. అనేక దశాబ్దాలుగా, వైద్య సంఘాలు, ఆహార నియంత్రణ అధికారులు కొవ్వు ఆరోగ్యానికి హానికరమని చెప్పారు. ఎందుకంటే కొవ్వు గుండెపోటు, కాలేయ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. కానీ చక్కెర గురించి ఎవ్వరూ ప్రస్తావించలేదు. కానీ ఇప్పుడు వైద్య శాస్త్రాల అభిప్రాయం మారింది. నేడు చాలా మంది వైద్యులు, శాస్త్రవేత్తలు, చక్కెర ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. చక్కెర నికోటిన్, కెఫిన్ వలె వ్యసనమని ఇది ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని భావిస్తున్నారు.

పంచదారను విషంతో పోల్చుతున్న కొందరు పరిశోధకులు అదోరకమైన మత్తు పదార్థం లాంటిదే అంటున్నారు. తీపి పదార్థాలు తినే అలవాటు ఉన్నవారు... రాన్రానూ వాటిని ఇంకా ఎక్కువగా తింటూ ఉండటానికి కారణం మత్తు పదార్థం లాంటి పంచదారే అంటున్నారు. నోట్లోని రుచి నాళికలు పంచదార రుచిని మళ్లీ మళ్లీ కోరుతాయని తెలిపారు. ఇది కాకుండా మరో కారణం డయాబెటీస్. రోజు రోజుకు షుగుర్ పేషెంట్లు పెరిగిపోతుండటంతో వైద్య నిపుణులు చక్కెరని అత్యంత ప్రమాదకారిగా, వైట్ పాయిజన్గా చెబుతున్నారు. దీనివల్ల చాలా అనర్థాలు జరుగుతున్నాయి.

ఇండియాలో చాలావరకు మధుమేహ వ్యాధిగ్రస్థులు పెరిగిపోయారు. తాజాగా ఈ వ్యాధి ఇప్పుడు అమెరికాలో విజృంబిస్తుంది. నేడు అమెరికా జనాభాలో 70 శాతం మంది స్థూలకాయానికి గురవుతున్నారు మరియు జనాభాలో 33 శాతం మంది మధుమేహంతో బాధపడుతున్నారు. అంతేకాదు అధిక సాంద్రత కలిగిన చక్కెర ఆహారాలను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధికి గురవుతున్నారని చాలా నివేదికలలో తేలింది. అందుకే ఈరోజు నుంచి జీవితంలో చక్కెరకి దూరంగా ఉంటే మంచిది. చక్కెర బదులు వారు బెల్లం, నల్ల బెల్లం, పటిక బెల్లం వాడాలి.

Tags:    

Similar News