Tea Powder: టీ పొడితో ఎన్నో ప్రయోజనాలు.. వీటిని క్లీన్ చేయడంలో వాడుతారు..?

Tea Powder: టీ పొడితో ఎన్నో ప్రయోజనాలు.. వీటిని క్లీన్ చేయడంలో వాడుతారు..?

Update: 2022-02-01 07:30 GMT

 టీ పొడితో ఎన్నో ప్రయోజనాలు.. వీటిని క్లీన్ చేయడంలో వాడుతారు..?

Tea Powder: ఉదయం లేవగానే చాలామంది టీ కోసం వెతుకుతారు. టీ తాగిన తర్వాతనే వారి రోజు ప్రారంభమవుతుంది. టెన్షన్ తగ్గించుకోవడానికి రిలాక్స్‌ కావడానికి టీని తాగుతారు. అయితే టీ మాత్రమే కాదు టీ పౌడర్ కూడా ఎన్నో ప్రయోజనాలను కలిగి ఉంది. కానీ వాటి గురించి కొంతమందికి మాత్రమే తెలుసు. చాలా పనులకు టీ పౌడర్‌ని వినియోగిస్తారు. అయితే ఆ పనులు ఎలాంటివో ఒక లుక్కేద్దాం.

సాధారణంగా నాన్‌ వెజ్‌ తినేవారికి మటన్ అంటే ఎంత ఇష్టమో అందరికి తెలుసు. కానీ ఆ మటన్ సరిగ్గా ఉడకకపోతే ఎలా ఉంటుంది. చాలా నిరుత్సాహానికి లోనవుతారు. అందుకే మటన్ వండేటప్పుడు మెత్తగా ఉడకడానికి టీ ఆకులని అందులో వేస్తారు. అవి మటన్‌ని ఉడికేవిధంగా చేస్తాయి. టీ పౌడర్‌ని మొక్కలకు మందుగా ఉపయోగిస్తారు. ముఖ్యంగా వీటిని గులాబీ మొక్కలకి ఎరువుగా వాడుతారు. ఇంట్లో టీ తయారు చేసిన తర్వాత మిగిలినదానిని నీటితో శుభ్రం చేసి ఆపై ఎండబెట్టి, మొక్కల కుండీలలో వేస్తే ఇది ఎరువుగా పనిచేస్తుంది.

చెక్కతో చేసిన ఫర్నిచర్‌ను పాలిష్ చేయడానికి టీ పౌడర్‌ని ఉపయోగిస్తారు. టీలో ఉన్న ఔషధ గుణాలు, రంగు కారణంగా ఇది ఫర్నిచర్ శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఫర్నిచర్ శుభ్రం చేయడానికి మీరు టీ పౌడర్‌ని పూర్తిగా ఉడకబెట్టాలి. ఈ నీరు చల్లారక దానిలో ఒక గుడ్డను వేసి పిండి ఫర్నిచర్ శుభ్రం చేయాలి. దీంతో ఫర్నిచర్ తలతల మెరుస్తుంది. తరచుగా ఫర్నిచర్ పాలిష్‌పై దుమ్ము ఉంటుంది. టీ ఆకుల నీటిని రుద్దడం ద్వారా పూర్తిగా శుభ్రంగా మారుతుంది.

ఇళ్లలో గాజు వస్తువులను శుభ్రపరిచే సమస్య ఉంటుంది. టీ ఆకులను నీటిలో బాగా ఉడకబెట్టాలి, చల్లబడిన తర్వాత గుడ్డను నీటిలో ముంచి గాజును శుభ్రం చేయాలి. దీంతో వస్తువులపై ఉండే చెడ్డ వాసనని తొలగించేందుకు టీ పౌడర్ ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఇంట్లో చేపలను వండుతారు ఆ తర్వాత వంటగది, చేతులు నీచు వాసన వస్తాయి. కాబట్టి మీ చేతులను టీ పౌడర్‌తో శుభ్రం చేసుకోండి దీని వల్ల వాసన పూర్తిగా పోతుంది. 

Tags:    

Similar News