Lactating Mothers Avoid Foods: పాలిచ్చే తల్లులు ఈ ఆహారాలు తినవద్దు.. పిల్లలకు చాలా ప్రమాదం..!
Lactating Mothers Avoid Foods: మహిళలు డెలివరీ అయ్యాక పిల్లల విషయంలో చాలా జాగ్ర త్తలు తీసుకోవాలి. లేదంటే పిల్లలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి.
Lactating Mothers Avoid Foods: మహిళలు డెలివరీ అయ్యాక పిల్లల విషయంలో చాలా జాగ్ర త్తలు తీసుకోవాలి. లేదంటే పిల్లలు ప్రమాదంలో పడే అవకాశాలు ఉంటాయి. పిల్లల అభివృద్ధికి తల్లి పాలు చాలా ముఖ్యమైనవి. బిడ్డకు అన్ని పోషకాలు తల్లి పాల నుంచే అందుతాయి. అందు వల్ల పాలిచ్చే తల్లులు వారి ఆహారంపై శ్రద్ధ పెట్టాలి. తల్లి ఆరోగ్యవంతమైన ఆహారం బిడ్డకు అమృతం లాంటిది అలాగే అనారోగ్యకరమైన ఆహారం దుష్ప్రభావాలు పాల ద్వారా బిడ్డకు చేరుతాయి. ఈ పరిస్థితిలో కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
గ్యాస్ ఉత్పత్తి చేసే ఆహారాలు
బ్రోకలీ, క్యాబేజీ, కిడ్నీ బీన్స్, చిక్‌పీస్, బ్లాక్‌గ్రామ్, వేరుశెనగ, బంగాళదుంపలు, బెండకాయలు వంటి కూరగాయలు గ్యాస్ ఉత్పత్తికి సాయపడుతాయి. ఈ పరిస్థితిలో పాలిచ్చే మహిళలు వీటిని తీసుకోవడం తగ్గించాలి. లేదంటే పిల్లవాడు గ్యాస్ సమస్యలతో బాధపడుతాడు.
కెఫిన్
కెఫీన్ పాలలో ఐరన్ పరిమాణాన్ని తగ్గిస్తుంది. ఇది పిల్లలలో రక్తహీనతకు కారణమవుతుంది. ఈ పరిస్థితిలో పాలిచ్చే మహిళలు ఒకటి కంటే ఎక్కువ కప్పుల కాఫీ లేదా టీని తాగకూడదు.
ఆమ్ల ఫలాలు
సిట్రస్ పండ్లు ఆరోగ్యానికి ముఖ్యమైనవి కానీ పాలిచ్చే తల్లులు వాటిని ఎక్కువగా తినకూడదు. ఇవి తరచుగా పిల్లలకు కడుపు సమస్యలను కలిగిస్తాయి.
ట్రాన్స్ ఫ్యాట్ ఆహారాలు
జంక్ ఫుడ్స్‌లో ఎక్కువ మొత్తంలో ట్రాన్స్ ఫ్యాట్ ఉంటుంది. ఇది ఆరోగ్యానికి హానికరం. పిల్లవాడు పాలు తాగుతున్నట్లయితే దాని దుష్ప్రభావాలు అతడిలో కూడా కనిపిస్తాయి. ఇది పిల్లల మెదడు డెవలప్‌మెంట్‌ను ప్రభావితం చేస్తుంది.
కృత్రిమ స్వీటెనర్
పాలిచ్చే తల్లులు కృత్రిమ తీపి పదార్థాలు ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. లేదంటే పిల్లలు ఊబకాయం, మధుమేహం బారిన పడే అవకాశాలు ఉన్నాయి.