Marriage: పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి..!

Marriage: పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెబుతారు పెద్దలు

Update: 2021-12-29 06:30 GMT

పెళ్లి చేసుకునే ముందు ఒక్కసారి ఈ విషయాలు తెలుసుకోండి..!

Marriage: పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇటు ఏడు తరాలు చూడాలని చెబుతారు పెద్దలు. ఇందులో ఎంత వాస్తవం ఉందో లేదో కానీ కచ్చితంగా ఇరు వర్గాల వారు ఎంక్వైరీ మాత్రం చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి పెళ్లి జరిగాక ఎటువంటి ఇబ్బందులు ఎదురవకూడదు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయి ఎలాంటివాడు, ఎటువంటి అలవాట్లు ఉంటాయి. అతని ఉద్యోగం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలి. వీటితో పాటు ప్రస్తుత కాలంలో అతడి ఖర్చుల గురించి కూడా తెలుసుకుంటే మంచిది. ఈ విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే మీకు అర్థమవుతుంది.

1. మీ భాగస్వామి ఉమ్మడి విషయాలలో ఖర్చు చేయడానికి వెనుకాడినట్లయితే అది ఆందోళనకరంగా ఉంటుంది. పొదుపు అవసరం కానీ ముఖ్యమైన ప్రదేశాలలో ఖర్చు చేయడం కూడా అవసరం. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకుంటే భవిష్యత్తులో చాలా సమస్యలు ఎదురుకావచ్చు. సంతానం కలగగానే ఉద్యోగం వదిలేస్తే ఆర్థిక ఇబ్బందులు మరింత పెరుగుతాయి.

2. మీరు మహిళ అయితే మీ భాగస్వామి మీ కంటే తక్కువ సంపాదిస్తే ఈ పరిస్థితి అత్యంత ప్రమాదకరమైనదిగా చెబుతారు. ఎందుకంటే పురుషులు ఈ విషయాన్ని అంత సులువుగా జీర్ణించుకోలేరు. ఈ విషయం గురించి పెళ్లికి ముందే మాట్లాడితే మంచిది.

3. మీరు మీ భాగస్వామి కంటే తక్కువ సంపాదిస్తే జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. కుటుంబానికి ప్రధాన జీవనాధారం అతనే కాబట్టి కుటుంబాన్ని బాగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా అతనిదే. అలాంటి భాగస్వాములు మంచి స్నేహితులుగా ఉంటారు. మీరు అతనికి అనుకూలంగా ఉంటే సరిపోతుంది.

4. మీ భాగస్వామి ప్రతినెలా చివరలో లేదా మధ్యలో సహాయం కోసం నిరంతరం మిమ్మల్ని డబ్బులు అడుగుతుంటే అతని ఆర్థిక ప్రణాళిక సరిగ్గా లేదని అర్థం. ఆర్థిక ప్రణాళిక లేకపోవడం మంచిది కాదు. పెళ్లి విషయంలో ఈ విషయం మంచిది కాదు.

Tags:    

Similar News