Kalonji Milk: ఆ సమస్యలతో బాధపడే మగవారికి ఈ నల్లగింజల పాలు సూపర్..!
Kalonji Milk: ఆ సమస్యలతో బాధపడే మగవారికి ఈ నల్లగింజల పాలు సూపర్..!
Kalonji Milk: పాలలో కొంచెం పసుపు కలుపుకొని తాగితే మంచిదని అందరికి తెలుసు. అలాగే పాలలో కలోంజి గింజలు కలుపుకొని తాగినా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ నలుపు రంగు విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. కలోంజి పాలు వివాహిత పురుషుల బలహీనతను తొలగిస్తుంది. సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది సెక్స్ జీవితాన్ని మెరుగుపరుస్తుంది.
కలోంజి పాలు మీ సత్తువ, రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతాయి. ఈ పాలని తాగడం వల్ల చాలా బలం వస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాలు సీజనల్ వ్యాధుల నుంచి కాపాడుతాయి. కలోంజి పాలు బరువు తగ్గడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇది జీవక్రియను పెంచుతుంది. మీకు మలబద్ధకం సమస్య ఉంటే కలోంజి పాలు తాగడం వల్ల తగ్గిపోతుంది. గర్భిణీ స్త్రీలు కలోంజి పాలు తాగడం చాలా మంచిది. దీని వల్ల మహిళల్లో రక్త నష్టం జరగదు. కడుపులో పెరుగుతున్న శిశువు ఎముకల అభివృద్ధికి సహాయపడుతుంది.
కలోంజిని ఆయుర్వేదంలో చాలా ఉపయోగకరమైన మూలికగా భావిస్తారు. ఇది దగ్గు నుంచి డయాబెటిస్ వరకు అన్ని వ్యాధులని తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. ఇందులో లభించే కాల్షియం, పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, జింక్ వంటి పోషకాలు ఆరోగ్య సమస్యలతో పోరాడటానికి సహాయం చేస్తాయి. కడుపులో నులిపురుగులు ఉంటే మూడు నాలుగు రోజులు నిరంతరం కలోంజిని తీసుకోవాలి. అర టీస్పూన్ ఫెన్నెల్ ఆయిల్ ను ఒక టీస్పూన్ వెనిగర్ తో కలిపి రోజుకు మూడుసార్లు తాగాలి. అప్పుడు కడుపులో ఉండే పురుగులు ఐదు నుంచి పది రోజులలో తగ్గుతాయి. వెంటనే కలోంజి పాలని డైట్‌లో చేర్చుకోండి.