శీతాకాలంలో ఈ లక్షణాలుంటే జాగ్రత్త..! ఆ వ్యాధి అయ్యే అవకాశం..
Arthritis: చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతారు. ఇది ఆర్థరైటిస్‌కి సంకేతం.
Arthritis: చలికాలం వచ్చిందంటే చాలు చాలామంది కీళ్ల నొప్పులతో బాధపడుతారు. ఇది ఆర్థరైటిస్‌కి సంకేతం. దేశంలో రోజు రోజుకి ఆర్థ్రరైటిస్ కేసులు ఎక్కువవుతున్నాయి. ప్రపంచంలోని ప్రతి మూడో వ్యక్తికి ఈ సమస్య ఉంది. చెడ్డ ఆహారపు అలవాట్లు, జీవనశైలి సరిగ్గా లేకపోవడం కారణంగా ఈ సమస్య పెరుగుతోంది. చలికాలంలో ఈ వ్యాధి ముప్పు గణనీయంగా ఉంటుంది. ఈ పరిస్థితిలోఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
కీళ్లనొప్పులు ఒక తాపజనక పరిస్థితి దీని వల్ల అనేక రకాల కీళ్ల సమస్యలు ఏర్పడుతాయి. ఇంతకుముందు ఈ వ్యాధి వృద్ధులలో మాత్రమే కనిపించేది కానీ ఇప్పుడు యువతలో కూడా కనిపిస్తున్నాయి. సాధారణంగా ఆర్థరైటిస్ రెండు రకాలు.. మొదటిది ఆస్టియో ఆర్థరైటిస్, రెండోది రుమటాయిడ్ ఆర్థరైటిస్. మృదులాస్థి క్రమంగా క్షీణించడం ప్రారంభించినప్పుడు ఆస్టియో ఆర్థరైటిస్ వస్తుంది. దీంతో కీళ్లలో వాపు వస్తుంది. వయసు పెరిగే కొద్దీ ఈ సమస్య పెరగడం మొదలవుతుంది. ఈ ఆర్థరైటిస్ లక్షణాలు చాలా త్వరగా కనిపించడం ప్రారంభిస్తాయి. దీని నుంచి సకాలంలో చికిత్స పొందడం ద్వారా ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.
రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది ఆటో ఇమ్యూన్ సమస్య. ఒకరి రోగనిరోధక వ్యవస్థ దానికదే కీళ్ల దగ్గర మృదులాస్థిపై దాడి చేయడం ప్రారంభించినప్పుడు ఇది సంభవిస్తుంది. ఈ సమస్య ఎక్కువగా మోకాళ్లు, మణికట్టు, వెన్నెముకలను ప్రభావితం చేస్తుంది. ఇది స్త్రీలలో ఎక్కువగా కనిపిస్తుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్‌లో ఎముకలు, కీళ్ల ఆకృతి మారిపోవడం కనిపిస్తుంది. దీని కారణంగా పాదాలు, చేతులు లేదా వేళ్లు వంకరగా మారుతాయి. అందుకే కీళ్లనొప్పులు రాకుండా ఉండాలంటే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.