Liver Detoxing: లివర్ డ్యామేజ్ అయిందా.. ఇవి తింటే కోలుకుంటుంది..!
Liver Detoxing: శరీరంలో లివర్ చాలా ముఖ్యమైన అవయవం. ఇది చాలా అవయవాల పనితీరుకి సహకరిస్తుంది.
Liver Detoxing: శరీరంలో లివర్ చాలా ముఖ్యమైన అవయవం. ఇది చాలా అవయవాల పనితీరుకి సహకరిస్తుంది. అయితే కొన్ని ఆహారపు అలవాట్ల వల్ల లివర్ దెబ్బతింటుంది. ముఖ్యంగా కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం వల్ల వాపు ఏర్పడుతుంది. దీనినే ఫ్యాటీ లివర్ వ్యాధిగా చెబుతారు. ఇందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) కాగా, మరొకటి ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. కొవ్వు పదార్థాలను అధికంగా తీసుకోవడం వలన నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఏర్పడుతుంది. అలాగే ఆల్కహాల్ అధికంగా తీసుకోవడం వల్ల ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ సంభవిస్తుంది. ఇలాంటి సమయంలో ఆహారంలో కొన్ని పదార్థాలని చేర్చుకోవాలి. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.
దాల్చిన చెక్క
కిచెన్‌లో ఉండే దాల్చిన చెక్కలో అనేక గుణాలు ఉంటాయి. ఇది వంటకాల రుచిని పెంచడమే కాకుండా అనేక వ్యాధులకి దివ్య ఔషధంగా పనిచేస్తుంది. దాల్చినచెక్కలో బలమైన శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. ఇవి కాలేయంలో మంటను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.
ఉసిరి కాయ
ఉసిరికాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఇవి కాలేయం దెబ్బతినకుండా కాపాడటమే కాకుండా అందులో ఏర్పడే టాక్సిన్స్‌ను క్లీన్ చేస్తాయి. అందుకే ప్రతిరోజు ఒక ఉసిరికాయ తినడం అలవాటు చేసుకోవాలి.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ అద్భుతమైన డిటాక్సింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. దీనిని సరైన రీతిలో తీసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ కాలేయం, శరీరం పనితీరుకు అంతరాయం కలిగించే టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.
పసుపు
ప్రతి ఒక్కరి వంటగదిలో పసుపు ఉంటుంది. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉంటాయి. అందుకే దీనిని ఆయుర్వేదంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. పసుపులో ఉండే కర్కుమిన్ నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ (NAFLD) నుంచి కాలేయ కణాలను రక్షించడంలో సహాయపడుతుంది.