Garlic In Summer: వేసవిలో వెల్లుల్లి వేడి చేస్తుందా.. శరీరంపై దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..?

Garlic In Summer: వెల్లుల్లి ఔషధాల గని. ఆయుర్వేదంలో దీనిని రారాజుగా పిలుస్తారు.

Update: 2023-06-21 10:49 GMT

Garlic In Summer: వేసవిలో వెల్లుల్లి వేడి చేస్తుందా.. శరీరంపై దీని ప్రభావం ఎలా ఉంటుందంటే..?

Garlic In Summer: వెల్లుల్లి ఔషధాల గని. ఆయుర్వేదంలో దీనిని రారాజుగా పిలుస్తారు. ఇది ఆహారం రుచిని పెంచడమే కాకుండా అనేక రోగాలని నయం చేస్తుంది. ఇది శరీరాన్ని ఫిట్‌గా ఉంచడంలో సహాయపడుతుంది. వెల్లుల్లిలో విటమిన్ ఎ, బి, సి అలాగే సల్ఫ్యూరిక్ యాసిడ్, ఐరన్, పిండి పదార్థాలు, కొవ్వు, ప్రోటీన్లు ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలోని ఇన్‌ఫెక్షన్‌ తొలగిపోతుంది. దీంతోపాటు ఇది శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడానికి పనిచేస్తుంది. వెల్లుల్లి శరీరానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు కానీ వేసవిలో దీనిని తినవచ్చో లేదో చాలామందికి తెలియదు. దాని గురించి ఈరోజు తెలుసుకుందాం.

దగ్గు, జలుబు నయం

వెల్లుల్లిని తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక జలుబు, ఊపిరితిత్తుల నొప్పి, న్యుమోనియా, ఉబ్బసం వంటి వ్యాధులు తగ్గుతాయి. దీన్ని తినడం వల్ల గుండెతో పాటు శ్వాస సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. రోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఒక వెల్లుల్లి రెబ్బను తినవచ్చు.

రక్త ప్రసరణ మెరుగు

హైబీపీ ఉన్నవారు వెల్లుల్లి తినడం చాలా మంచిది. ఇది యాంటీబయాటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. దీని కారణంగా రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. తలనొప్పి, వాంతులు సమస్య దూరమవుతుంది. వెల్లుల్లి తినడం వల్ల రక్తం పలుచగా మారుతుంది. దీని ప్రవాహ వేగం పెరుగుతుంది. ఇది గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

పంటి నొప్పికి ఉపశమనం

ఎవరికైనా పంటి నొప్పి ఉంటే వెల్లుల్లిని దివ్యౌషధంగా పరిగణిస్తారు. ఇందులో క్యాల్షియంతో పాటు యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇవి పంటి నొప్పి నుంచి త్వరగా ఉపశమనం కలిగిస్తాయి. వెల్లుల్లి రెబ్బను మెత్తగా రుబ్బి ప్రభావిత ప్రాంతంలో అప్లై చేస్తే ఉపశమనం లభిస్తుంది.

వేసవిలో వెల్లుల్లి తినవచ్చు

వెల్లుల్లిని వేసవిలో తినవచ్చు. ఎండాకాలంలో వెల్లుల్లి తినడం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అయితే వెల్లుల్లి ప్రభావం వేడిగా ఉంటుంది. ఈ పరిస్థితిలో వెల్లుల్లిని ఎక్కువగా తినడం వల్ల అలెర్జీలు లేదా కడుపు సంబంధిత సమస్యలు ఎదురవుతాయి. ఇందులో అల్లిసిన్ అనే మూలకం ఉంటుంది. దీని కారణంగా కాలేయానికి తీవ్రమైన హాని కలుగుతుంది. అందుకే వేసవిలో మితంగా తీసుకోవాలి.

Tags:    

Similar News