Iron Deficiency: ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలను ప్రతిరోజు తినండి..!

Iron Deficiency: శరీరానికి అన్నిపోషకాలు సరైన మోతాదులో అందితేనే వారు ఆరోగ్యంగా ఉంటారు.

Update: 2024-03-15 14:30 GMT

Iron Deficiency: ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారా.. ఈ ఆహారాలను ప్రతిరోజు తినండి..!

Iron Deficiency: శరీరానికి అన్నిపోషకాలు సరైన మోతాదులో అందితేనే వారు ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే వెంటనే అనారోగ్యానికి గురవుతారు. అలాగే శరీరానికి ఐరన్‌ అనేది చాలా ముఖ్యమైన పోషకం. ఇది శరీరంలో అన్ని భాగాలకు ఆక్సిజన్ అందించడానికి సాయపడుతుంది. ఎర్ర రక్త కణాల తయారీలో తోడ్పడుతుంది. మహిళల్లో ఐరన్‌ లోపం ఎక్కువగా ఉంటుంది. దీనిని అధిగమించడానికి సప్లిమెంట్లు అందుబాటులో ఉన్నప్పటికీ కొన్ని ఆహారాల సాయంతో ఐరన్‌ లోపాన్ని నయం చేయవచ్చు. వాటి గురించి ఈరోజు తెలుసుకుందాం.

బాడీలో ఐరన్‌ లోపాన్ని ఎలా గుర్తించాలి..?

అలసట, తలనొప్పి, విశ్రాంతి లేకపోవడం, రెస్ట్‌లెస్ లెగ్స్ సిండ్రోమ్, గుండె సమస్యలు, గర్భధారణ సమస్యలు, పిల్లలలో నెమ్మదిగా పెరుగుదల సమస్యలు ఉంటే శరీరంలో ఐరన్‌ లోపించిందని అర్థం చేసుకోవాలి. వెంటనే డాక్టర్‌ని సంప్రదించి చికిత్స తీసుకోవాలి.

బచ్చలికూర

100 గ్రాముల బచ్చలికూరలో 2.7 mg ఐరన్‌ ఉంటుంది. ఇందులో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది.ఇది ఐరన్‌ శోషణను పెంచుతుంది. శరీరంలో రక్తహీనత సమస్యతో బాధపడుతున్న వ్యక్తులకు బచ్చలికూర చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

శెనగలు

ఒక కప్పు వండిన శెనగలలో దాదాపు 6.6 mg ఐరన్‌ ఉంటుంది. శాఖాహారం తినేవారికి ఇవి బెస్ట్ అని చెప్పవచ్చు. శెనగలు త్వరగా ఐరన్‌ స్థాయిలను పెంచుతాయి.

గుమ్మడి గింజలు

28 గ్రాముల గుమ్మడి గింజల్లో 2.5 మి.గ్రా ఐరన్‌ ఉంటుంది. ఇందులో విటమిన్ కె, జింక్, మాంగనీస్, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. ఇది ఐరన్‌ లోపాన్ని అధిగమించడానికి మధుమేహం తగ్గించడానికి పనిచేస్తాయి.

బ్రోకలీ

1 కప్పు వండిన బ్రోకలీలో 1 mg ఐరన్‌ ఉంటుంది. అలాగే విటమిన్ సి పుష్కలంగా ఉండటం వల్ల ఐరన్‌ బాగా గ్రహించేలా చేస్తుంది. ఇది క్యాన్సర్‌ను నివారించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది.

డార్క్ చాక్లెట్

28 గ్రాముల చాక్లెట్‌లో 3.4 mg ఐరన్‌ ఉంటుంది. దీనితో పాటు మెగ్నీషియం, కాపర్ లభిస్తాయి. రక్తహీనతను నివారించడానికి డార్క్ చాక్లెట్ ఆరోగ్యకరమైన రుచికరమైన ఎంపిక అని చెప్పవచ్చు.

Tags:    

Similar News