Uric Acid: యూరిక్‌ యాసిడ్‌ తగ్గాలంటే ఈ 3 డ్రై ఫ్రూట్స్‌ తినాల్సిందే..!

Uric Acid: ఈ రోజుల్లో చాలామంది యూరిక్‌ యాసిడ్‌ సమస్యని ఎదుర్కొంటున్నారు. దీనిని తగ్గించడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది.

Update: 2022-05-24 13:30 GMT

Uric Acid: యూరిక్‌ యాసిడ్‌ తగ్గాలంటే ఈ 3 డ్రై ఫ్రూట్స్‌ తినాల్సిందే..!

Uric Acid: ఈ రోజుల్లో చాలామంది యూరిక్‌ యాసిడ్‌ సమస్యని ఎదుర్కొంటున్నారు. దీనిని తగ్గించడానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. అన్ని డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి ముఖ్యమైనవి అయినప్పటికీ యూరిక్ యాసిడ్ నొప్పి ఉన్నవారు ఒక మూడు డ్రై ఫ్రూట్స్‌ కచ్చితంగా తినాలి. కాబట్టి అలాంటి డ్రై ఫ్రూట్స్ గురించి తెలుసుకుందాం.

1. బాదం నొప్పిని తగ్గిస్తుంది

యూరిక్ యాసిడ్ పేషెంట్లు బాదంపప్పును ఎక్కువగా తినాలి. ఇది మీకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో కాల్షియం, ఫైబర్, మెగ్నీషియం, కాపర్, విటమిన్ కె, ప్రొటీన్, జింక్ ఉంటాయి. ఈ పరిస్థితిలో ప్రతిరోజూ తినడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల కీళ్ల నొప్పులు, వాపుల సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

2. జీడిపప్పు నొప్పిని తగ్గిస్తుంది

జీడిపప్పులో పొటాషియం, విటమిన్ సి, ఫైబర్ వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ను నియంత్రించడంలో సహాయపడతాయి. నొప్పి ఎక్కువగా ఉన్నవారు వీటిని కచ్చితంగా ఆహారంలో చేర్చుకోవాలి.

3. వాల్‌నట్‌లు ప్రయోజనకరంగా ఉంటాయి

వాల్‌నట్‌లను సూపర్‌ఫుడ్‌గా పరిగణిస్తారు. ఇందులో యాంటీ-ఆక్సిడెంట్లు, పాలీ అన్‌శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మీ శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News