Health Tips: వేగంగా బరువు తగ్గడానికి ఈ గింజలు సూపర్.. ఇలా తీసుకోండి..!

Health Tips: బరువు తగ్గడానికి చియా గింజలు బాగా ఉపయోగపడుతాయి.

Update: 2023-01-01 04:30 GMT

Health Tips: వేగంగా బరువు తగ్గడానికి ఈ గింజలు సూపర్.. ఇలా తీసుకోండి..!

Health Tips: బరువు తగ్గడానికి చియా గింజలు బాగా ఉపయోగపడుతాయి. ఇందులో ఉండే పోషకాలు బరువు తగ్గించడానికి సహాయపడతాయి. చియా సీడ్స్ తినడం వల్ల పొట్ట కొవ్వు తగ్గుతుంది. చియా సీడ్స్‌లో ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, కాల్షియం, కాపర్, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు ఉంటాయి. చియా విత్తనాలు బరువు తగ్గించడంలో సహాయపడటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.

చియా విత్తనాలు జీవక్రియను పెంచడం వల్ల బరువు తగ్గించడంలో సహాయపడతాయి. చియా గింజల్లో ఉండే ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు కొవ్వును కరిగించడానికి పని చేస్తాయి. ఈ విత్తనాలలో కేలరీల పరిమాణం తక్కువగా ఉంటుంది. నీటిలో నానబెట్టిన చియా గింజలను తినడం వల్ల బరువు వేగంగా తగ్గుతారు. చియా సీడ్స్‌లో ఉండే పోషకాలు బరువు తగ్గించడంలో సహాయపడతాయి. నానబెట్టిన చియా గింజలను తినడం వల్ల బెల్లీఫ్యాట్‌ తగ్గుతుంది. వీటిని అరగంట నానబెట్టిన తర్వాత తినవచ్చు.

పండ్లతో కూడిన చియా సీడ్స్ రుచిగా ఉంటాయి. బరువు తగ్గడానికి, నానబెట్టిన చియా గింజలతో స్మూతీని తయారు చేయాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుంది. చియా విత్తనాలను ఓట్స్‌తో కలిపి తింటే బరువు తగ్గుతారు. ఈ రెండూ తక్కువ కేలరీలు అధిక ఫైబర్ కలిగిన ఆహారాలు. ఇవి బరువు తగ్గించడంలో సహాయపడతాయి. ఓట్స్, చియా సీడ్స్ మిక్స్ చేసి బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. బరువు తగ్గాలంటే చియా గింజలు కచ్చితంగా డైట్‌లో ఉండాలి.

Tags:    

Similar News