Fenugreek Excess Harm: మెంతులు అధికంగా వాడితే ఆరోగ్యానికి హాని.. ఈ వ్యక్తులు దూరంగా ఉండాలి..!
Fenugreek Excess Harm: మనం ఇళ్లలో వంట చేసేటప్పుడు కూరల్లో చివరగా కొత్తిమీర, పుదీన, మెంతి వేస్తుంటాం. ఇవి కూరకు రుచిని, మంచి సువాసనను అందిస్తాయి.
Fenugreek Excess Harm: మనం ఇళ్లలో వంట చేసేటప్పుడు కూరల్లో చివరగా కొత్తిమీర, పుదీన, మెంతి వేస్తుంటాం. ఇవి కూరకు రుచిని, మంచి సువాసనను అందిస్తాయి. అయితే ఏదైనా ఒక పరిమితికి మించి వాడాలి అంతకంటే ఎక్కువగా వాడితే అది మంచికి బదులు హాని చేస్తుంది. ఈ నియమం మెంతికూర, గింజలకు వర్తిస్తుంది. మెంతికూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. కానీ మెంతులు అధికంగా వాడితే ఆరోగ్యానికి మచిదికాదు. మెంతి గింజలను జాగ్రత్తగా వాడాలి. మెంతులు ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
చాలా మంది డయాబెటిక్ పేషెంట్లు మెంతి నీటిని తాగుతారు కానీ ఎక్కువగా తాగితే చక్కెర స్థాయి గణనీయంగా తగ్గుతుంది. దీని వల్ల వారి ఆరోగ్యం క్షీణిస్తుంది. మెంతి ఆకుల్లో సోడియం తక్కువగా ఉంటుంది. దీని వల్ల బీపీ తగ్గవచ్చు. అధిక బీపీ ఉన్న రోగి మెంతి నీరు తాగకుండా ఉండాలి. మీకు ఏదైనా శ్వాసకోశ వ్యాధి ఉంటే మెంతి నీరు తాగడం తినడం హానికరం. మెంతులు వేడి స్వభావాన్ని కలిగి ఉండటం వల్ల శ్వాసకోశ సమస్యలను మరింత పెంచుతాయి.
గర్భిణీ లు మెంతులు తినడం మానుకోవాలి ఎందుకంటే రక్తస్రావం సమస్యలు ఎదురవుతాయి. మెంతులు తినడం వల్ల పాలిచ్చే స్త్రీలకు సమస్యలు పెరుగుతాయి. ఇది కడుపు నొప్పికి కారణం అవుతుంది. మెంతి నీరు తాగడం వల్ల కడుపు సంబంధిత సమస్యలు వస్తాయి. గ్యాస్, అజీర్ణం సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. మలబద్ధకం సమస్య వస్తుంది. కాబట్టి కడుపు సమస్యలు ఉన్నవారు మెంతికూర, గింజలకు దూరంగా ఉండాలి. చర్మ అలెర్జీలు ఉన్నవారు మెంతులు తినకూడదు. చర్మంపై చికాకు దద్దుర్లు కలిగిస్తాయి.