Health Tips: ఇవి జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే ఆహారాలు.. రోజు తీసుకుంటే మతిమరుపు దూరం..!
Health Tips: మన శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన భాగం.
Health Tips: మన శరీరంలో మెదడు చాలా ముఖ్యమైన భాగం. దీని ద్వారా మాత్రమే ఏదైనా ఆలోచించడం, అనుభూతి చెందడం, గుర్తుంచుకోవడం జరుగుతుంది. కానీ వయసు పెరిగే కొద్దీ మెదడు బలహీనపడటం మొదలవుతుంది. ఈ వేగవంతమైన జీవితంలో సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల జ్ఞాపకశక్తి బలహీనపడుతోంది. ఈ పరిస్థితిలో మీరు కొన్ని ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ఎందుకంటే మనం ఏది తిన్నా అది నేరుగా మన శరీరం, మెదడుపై ప్రభావం చూపుతుంది. మీకు మతిమరుపు ఉంటే రోజూ కొన్ని ఆహారాలు తినాలి. వాటి గురించి తెలుసుకుందాం.
డ్రై ఫ్రూట్స్, విత్తనాలను
విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఎందుకంటే ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి మెదడును షార్ప్‌గా మార్చడానికి, జ్ఞాపకశక్తిని పెంచడానికి పనిచేస్తాయి. అందువల్ల మీకు మతిమరుపు ఉంటే వీటిని రోజు తీసుకోవాలి.
డార్క్ చాక్లెట్
చాలా మంది డార్క్ చాక్లెట్ తినడానికి ఇష్టపడరు. కానీ ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీన్ని తినడం వల్ల మైండ్ షార్ప్ అవుతుంది. మీ మూడ్ బాగుంటుంది.
ఆకు కూరలు
ఆకు కూరలు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో మెదడుకి మేలు చేసే గుణాలు పుష్కలంగా ఉంటాయి. మీ జ్ఞాపకశక్తి బలహీనంగా ఉంటే ప్రతిరోజూ ఆకు కూరలు డైట్‌లో ఉండేవిధంగా చూసుకోండి.
వ్యాయామం
ఆరోగ్యంగా ఉండటానికి ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఇది మెదడుని షార్ప్ చేస్తుంది. కొత్త కొత్త ఆలోచనలకి నాంది పలుకుతుంది. మెదడుకి కావాల్సిన రక్త సరఫరా అందిస్తుంది.