Health Tips: ఈ రెడ్ వెజిటెబుల్ ఆరోగ్యానికి దివ్యౌషధం.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Health Tips: ఈ రెడ్ వెజిటెబుల్ ఆరోగ్యానికి దివ్యౌషధం.. ఈ ఆరోగ్య సమస్యలకి చక్కటి పరిష్కారం..!
Health Tips: బీట్‌రూట్ ప్రతి సీజన్‌లో లభించే కూరగాయ. దీనిని సలాడ్ లేదా జ్యూస్ రూపంలో ఎక్కువగా తీసుకుంటారు. ఇందులో ఫోలేట్, మాంగనీస్ పుష్కలంగా ఉంటాయి. ఇవి మన హృదయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాదు ఫోలేట్ మన మెదడుకు మేలు చేస్తుంది. ఇది కాకుండా బీట్‌రూట్‌లో అనేక విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా సహాయం చేస్తాయి. రోజువారీ ఆహారంలో బీట్‌రూట్‌ని చేర్చుకోండి. దీనివల్ల ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.
బ్రెయిన్ షార్ప్
బీట్‌రూట్‌లో ఉండే నైట్రేట్‌లు పెరిగిన రక్తపోటును తగ్గించడంలో సహాయపడతాయి. అంతే కాదు బీట్‌రూట్‌ను రోజూ తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. బీట్‌రూట్ తినడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉండి షార్ప్‌గా మారుతుంది.
రక్తాన్ని పెంచుతుంది
బీట్‌రూట్‌లో ఐరన్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలోని రక్తహీనతను తొలగించడంలో సహాయపడతాయి. బీట్‌రూట్‌ను రోజూ తీసుకుంటే హిమోగ్లోబిన్‌కు లోటు ఉండదు. దీని వల్ల శరీరంలో ఆక్సిజన్ స్థాయి, రక్త స్థాయి బాగా జరుగుతుంది.
కొలెస్ట్రాల్
బీట్‌రూట్ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్‌ను అంతం చేస్తుంది. దీని కారణంగా ధమనులు ఫ్రెష్ అవుతాయి. ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలకి దూరంగా ఉంటారు.
ముఖంలో మెరుపు
రోజూ బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. అంతే కాదు ముఖంలో మెరుపు వస్తుంది. అందంగా కనిపిస్తారు.
రక్తపోటు అదుపులో
అధిక రక్తపోటు సమస్య ఉంటే ఖచ్చితంగా బీట్‌రూట్ సలాడ్ లేదా జ్యూస్ తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల కొన్ని రోజుల్లో బీపీ అదుపులో ఉంటుంది. తరచుగా అలసట లేదా బలహీనత ఉంటే బీట్‌రూట్ దివ్యౌషధం కంటే తక్కువేమి కాదు. బీట్‌రూట్ తినడం వల్ల రక్త శుద్ధి జరుగుతుంది. ఇది శరీరంలో ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది.