Health Tips: ఈ పండ్లని డైట్‌లో చేర్చుకుంటే మీ వయసు 10 సంవత్సరాలు తగ్గుతుంది..!

Health Tips: పండ్లలో అనేక రకాల విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.

Update: 2023-02-10 03:00 GMT

Health Tips: ఈ పండ్లని డైట్‌లో చేర్చుకుంటే మీ వయసు 10 సంవత్సరాలు తగ్గుతుంది..!

Health Tips: పండ్లలో అనేక రకాల విటమిన్లు, పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. అందుకే ప్రతి ఒక్కరూ డైట్‌లో పండ్లని చేర్చుకోవాలి. పండ్లు తినడం వల్ల చర్మానికి కొన్ని అద్భుతమైన ప్రయోజనాలు లభిస్తాయి. ఇవి మొటిమలు, మచ్చలు, నివారించడంలో చర్మాన్ని మెరిసేలా చేయడంలో సహాయపడుతాయి. యాంటీ ఏజింగ్‌గా పనిచేసే అలాంటి కొన్ని పండ్ల గురించి ఈ రోజు తెలుసుకుందాం.

స్ట్రాబెర్రీస్

స్ట్రాబెర్రీస్ విటమిన్ సితో సహా అనేక యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మంలో కొల్లాజెన్‌ను పెంచడంలో సహాయపడతాయి. దీని వల్ల చర్మం మరింత యవ్వనంగా కనిపించడమే కాకుండా ముఖంలో గ్లో వస్తుంది.

యాపిల్స్‌

యాపిల్స్‌లో ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి చర్మంపై మెరుపును తెస్తాయి. వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. యాపిల్‌తో పాటు దాని పీల్స్‌లో యాంటీఆక్సిడెంట్లు, పొటాషియం, మెగ్నీషియం, డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇవి చర్మాన్ని రక్షించడమే కాకుండా యవ్వనంగా ఉంచడంలో సహాయపడతాయి.

పుచ్చకాయ

పుచ్చకాయ చర్మానికి చాలా మంచిది. ఇందులో 92% నీరు ఉంటుంది. ఇది చర్మానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది. ఇది కాకుండా విటమిన్ సి, ఎ, బి1 వంటి ఇతర పోషకాలు లభిస్తాయి. ఈ పోషకాలు స్కిన్ డ్యామేజ్‌ని నివారిస్తాయి. వాపును తగ్గిస్తాయి. చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా మారుస్తాయి.

నిమ్మకాయ

నిమ్మకాయ సిట్రస్ కుటుంబానికి చెందిన మరొక పండు. ఇది పోషకాలు, విటమిన్లతో నిండి ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉన్న నిమ్మకాయ చర్మాన్ని ప్రకాశవంతం చేస్తుంది. చర్మంపై ముడతలు తొలగించి అందంగా కనిపించేలా చేస్తుంది.

Tags:    

Similar News