Liver Damaged: ఈ లక్షణాలు ఉంటే లివర్ డ్యామేజ్ అయినట్లే..!
Liver Damaged: కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగమని అందరికీ తెలుసు. శరీరంలోని ఆహారాన్ని పోషకాలు, శక్తిగా మార్చడానికి కాలేయం పనిచేస్తుంది.
Liver Damaged: కాలేయం మన శరీరంలో ముఖ్యమైన భాగమని అందరికీ తెలుసు. శరీరంలోని ఆహారాన్ని పోషకాలు, శక్తిగా మార్చడానికి కాలేయం పనిచేస్తుంది. దీంతో పాటు ఇది మన శరీరంలో ఉన్న రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. కాలేయం పాడైందని రోగికి నెలల తరబడి తెలియదు. కాబట్టి మీరు లక్షణాల గురించి తెలుసుకుంటే వ్యాధిని ముందుగానే గుర్తించవచ్చు. మీ కాలేయం దెబ్బతిన్నట్లు చూపించే 5 ప్రధాన లక్షణాల గురించి తెలుసుకుందాం.
1. వాంతులు
మీరు తరచూ వాంతులకి గురవుతుంటే ఒకసారి వైద్యుడిని సంప్రదించాలి. ఎందుకంటే ఇది సాధారణ వాంతులు కాకపోవచ్చు. వరుసగా చాలా రోజులు వాంతులు అవుతుంటే కాలేయం దెబ్బతిన్నదని అర్థం.
2. ఆకలి లేకపోవడం
చాలా మంది ప్రజలకి ఆకలి ఉండదు. ఈ సమస్య నిరంతరం 15 రోజుల పాటు కొనసాగుతుంటే దానిని తేలికగా తీసుకోకూడదు. ఎందుకంటే ఇది కూడా కాలేయం దెబ్బతింటుదని అర్థం.
3. అలసిపోవడం
చాలా సార్లు మీరు అలసిపోయినట్లు కనిపిస్తే వెంటనే అప్రమత్తమవ్వాలి. ఇది లివర్ డ్యామేజ్ లక్షణాలలో ఒకటి.
4. అతిసారం
చాలా సార్లు మీరు వాతావరణంలో మార్పు లేదా అతిసారంతో బాధపడితే నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇది కాలేయం దెబ్బతీసే లక్షణాలలో ఒకటి.
5. బరువు తగ్గడం
ఇది కాకుండా మీరు అకస్మాత్తుగా బరువు తగ్గడం ప్రారంభిస్తే మంచిది కాదు. ఎందుకంటే కొన్నిసార్లు కాలేయం దెబ్బ తిన్నప్పుడు వేగంగా బరువు తగ్గడం, పెరగడం ఉంటుంది.