Winter Morning Foods: చలికాలం ఉదయాన్నే ఇవి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. శరీరానికి వెచ్చదనం వస్తుంది..!

Winter Morning Foods: చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో బాడీలో ఉండే అవయవాల పనితీరు మందగిస్తుంది.

Update: 2024-01-13 02:30 GMT

Winter Morning Foods: చలికాలం ఉదయాన్నే ఇవి తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది.. శరీరానికి వెచ్చదనం వస్తుంది..!

Winter Morning Foods: చలికాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సీజన్‌లో బాడీలో ఉండే అవయవాల పనితీరు మందగిస్తుంది. పాత నొప్పులు అన్నీ బయటకు వస్తాయి. దీనికి తోడు సీజనల్ వ్యాధులు ఇబ్బందిపెడుతాయి. చలికాలం చల్లటి గాలి వల్ల చాలా సమస్యలు ఎదురవుతాయి. ఇలాంటి సమయంలో ఇమ్యూనిటీ పెంచే ఆహారాలు తీసుకోవాలి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచడంతో పాటు రోగాల బారినుంచి కాపాడుతాయి. అలాంటి కొన్ని ఆహారాల గురించి ఈరోజు తెలుసుకుందాం.

చలికాలంలో శరీరాన్ని వేడి చేసే ఆహారాలను తినడానికి ప్రజలు ఇష్టపడతారు. ఇవి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి. చలికాలం ఆహారాలలో మొదటగా చెప్పుకోవాల్సింది నానబెట్టిన బాదంపప్పులు. గుప్పెడు నానబెట్టిన బాదంపప్పులను ప్రతిరోజు ఉదయం పూట తింటే శరీరం బలంగా తయారవుతుంది. గోరువెచ్చని నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల శరీరంలోని అనేక వ్యాధులు నయమవుతాయి. శరీరానికి అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

చల్లటి వాతావరణంలో ప్రతిరోజూ ఉదయం నానబెట్టిన వాల్‌నట్‌లను కూడా తినడం అలవాటు చేసుకోవాలి. ఇందులో విటమిన్లు, ఖనిజాలు, పొటాషియం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి పొట్టకు చాలా మేలు చేస్తాయి. మీరు రోజూ బొప్పాయి తినాలి. ఇది పొట్టను ఆరోగ్యంగా ఉంచుతుంది. అన్ని పొట్ట సమస్యలను దూరం చేస్తుంది. దీన్ని తినడం వల్ల శరీరం తేలికగా మారుతుంది. ఉదయపు ఆహారంలో తప్పనిసరిగా ఓట్ మీల్ తినాలి. ఇందులో కేలరీలు తక్కువ, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల ఆకలి ఎక్కువగా ఉండదు.

Tags:    

Similar News