Sweet Potato Health Benefits: చిలగడదుంపలో పోషకాలు పుష్కలం.. తింటే శరీరానికి ఈ ప్రయోజనాలు..!

Sweet Potato Health Benefits: చిలగడదుంప సీజన్‌ వచ్చేసింది. కొన్ని ఏరియాల్లో దీనిని కందగడ్డ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా ఇందులో మాత్రం పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Update: 2024-01-27 14:00 GMT

Sweet Potato Health Benefits: చిలగడదుంపలో పోషకాలు పుష్కలం.. తింటే శరీరానికి ఈ ప్రయోజనాలు..!

Sweet Potato Health Benefits: చిలగడదుంప సీజన్‌ వచ్చేసింది. కొన్ని ఏరియాల్లో దీనిని కందగడ్డ అని పిలుస్తారు. ఏ పేరుతో పిలిచినా ఇందులో మాత్రం పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇది ఎక్కువగి ఫిబ్రవరి, మార్చి నెలల్లో మార్కెట్‌లో ఎక్కువగా లభిస్తుంది. చిలగడ దుంపలను భూగర్భంలో పండిస్తారు. దీని రుచి చాలా తియ్యగా ఉంటుంది. అందుకే చాలా మంది తింటారు. ఇది నారింజ, గోధుమ మరియు ఊదా వంటి అనేక రంగులలో లభిస్తుంది. దీన్ని రోజూ ఉడికించి తింటే ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో ఈ రోజు తెలుసుకుందాం.

చిలగడదుంపలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. దీనిని తింటే శరీరానికి విటమిన్ ఎ, విటమిన్ సి, పొటాషియం, ఫైబర్ వంటి పోషకాలు అందుతాయి. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి బలమైన రోగనిరోధక శక్తిని కలిగి ఉండటం అవసరం. లేదంటే అనేక రకాల వ్యాధుల బారినపడుతాం. చిలగడదుంపలను రోజూ తింటే జలుబు, దగ్గు, ఫ్లూ, ఇతర వైరల్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. ఎందుకంటే వీటిలో విటమిన్ ఎ, విటమిన్ సి అధిక మోతాదులో ఉంటాయి.చిలగడదుంపల్లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ప్రేగు కదలికలను సులభతరం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్ వంటి కడుపు సమస్యలు ఉండవు.

భారతదేశంలో హృద్రోగుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. చాలా మంది గుండెపోటు కారణంగా ప్రాణాలు వదులుతున్నారు. ఈ పరిస్థితిలో మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి చిలగడదుంప వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవాల్సి ఉంటుంది. వీటిని తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. తద్వారా గుండెపోటు ప్రమాదం తగ్గుతుంది. చిలగడదుంప రుచి తీపిగా ఉన్నప్పటికీ ఇది తక్కువ కేలరీలు, అధిక ఫైబర్ కలిగి ఉంటుంది. దీని కారణంగా కడుపు చాలా సమయం పాటు కడుపునిండిన భావన కలుగుతుంది. ఇది మిమ్మల్ని అతిగా తినకుండా నిరోధిస్తుంది. క్రమంగా బరువు తగ్గుతారు.

Tags:    

Similar News