Weight Loss Drinks: నిద్ర లేచిన వెంటనే ఈ పానీయాలు తాగితే బరువు తగ్గడం ఖాయం..!
Weight Loss Drinks: చాలా మంది శరీరం ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు.
Weight Loss Drinks: చాలా మంది శరీరం ఫిట్‌గా ఉండాలని కోరుకుంటారు. కానీ చెడు అలవాట్ల కారణంగా శరీరం చుట్టూ కొవ్వు పేరుకుపోతుంది. అప్పుడు శరీరం ఆకృతి మొత్తం చెడిపోతుంది. ఇది మన అందంపై ప్రభావం చూపుతుంది. దీంతో చాలామంది పెరగిన కొవ్వు తగ్గించుకోవడానికి ఉదయం, సాయంత్రం పరిగెత్తడం, జిమ్‌లో గంటల తరబడి చెమటలు కక్కడం చేస్తారు. కానీ ఇది అందరికీ సాధ్యం అయ్యే పనికాదు. అంతేకాదు ప్రతి ఒక్కరూ సెలబ్రిటీల మాదిరిగా డైటీషియన్ పర్యవేక్షణలో 24 గంటలు ఉండలేరు. అటువంటి పరిస్థితిలో కొన్ని బరువు తగ్గించే పానీయాలు తాగితే ప్రయోజనం ఉంటుంది. అటువంటి వాటి గురించి తెలుసుకుందాం.
1. గ్రీన్ టీ
గ్రీన్ టీ ఎల్లప్పుడూ పాలు, చక్కెర టీకి గొప్ప ప్రత్యామ్నాయంగా చెప్పవచ్చు. ఫిట్‌గా ఉండాలంటే ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో గ్రీన్ టీ తాగాలి. దీని రుచి చేదుగా ఉండవచ్చు కానీ బరువు తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.
2. నిమ్మరసం
నిమ్మరసం బరువు తగ్గడానికి చాలా చౌకైన ఎంపిక. దీని కోసం మీరు ఉదయాన్నే నిద్రలేచి ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక నిమ్మకాయను పిండి అందులో నల్ల ఉప్పు కలిపి తాగాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల బరువు చాలా వరకు తగ్గుతారు.
3. వాము వాటర్
దాదాపు ప్రతి భారతీయ వంటగదిలో కనిపించే ఒక మసాలా దినుసు వాము. దీనిని క్యారమ్ సీడ్స్ అని కూడా పిలుస్తారు. దీన్ని తీసుకోవడం వల్ల జీవక్రియ రేటు పెరుగుతుంది. బరువు తగ్గడంలో సహాయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో వాము వేసి రాత్రంతా నానబెట్టి ఉదయం ఫిల్టర్ చేసి తాగాలి.
4. సోంపు వాటర్
సోంపుని తరచుగా భోజనం తర్వాత తినడం సంప్రదాయం. ఎందుకంటే ఇది సహజమైన మౌత్ ఫ్రెషనర్‌గా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ సోంపు మిక్స్ చేసి రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే కాటన్ క్లాత్‌తో వడపోసి తాగాలి.