Alert Married Men: పెళ్లయిన మగవారికి అలర్ట్.. ఈ గింజలు కలిపిన పాలు తాగితే మరింత బలం..!
Alert Married Men: ఆధునిక జీవనశైలి వల్ల చాలామంది మగవారు బలహీనంగా తయారవుతున్నారు. ముఖ్యంగా పెళ్లయిన మగవారు ఎక్కువగా సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు.
Alert Married Men: ఆధునిక జీవనశైలి వల్ల చాలామంది మగవారు బలహీనంగా తయారవుతున్నారు. ముఖ్యంగా పెళ్లయిన మగవారు ఎక్కువగా సంతానోత్పత్తి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి విషయంలో వైద్యులు సూచించే మందుల కన్నా ఆహార పానీయాలలో మార్పులు చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. ప్రతిరోజు గ్లాసు పాలలో కలోంజి గింజలని కలుపుకొని తాగితే మంచి ప్రయోజనాలు ఉంటాయి. ఈ నలుపు రంగు విత్తనాలలో యాంటీ ఆక్సిడెంట్లు, కాల్షియం, ఐరన్, కాపర్, ఫాస్పరస్, ఫోలిక్ యాసిడ్ వంటివి పుష్కలంగా లభిస్తాయి. ఈ పానీయం ప్రయోజనాల గురించి ఈరోజు తెలుసుకుందాం.
పురుషుల బలం రెట్టింపు
కలోంజి పాలు తాగడం వల్ల పురుషులలో బలహీనత తొలగిపోతుంది. సంతానోత్పత్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దాంపత్య జీవితాన్ని మెరుగుపరుస్తాయి. తండ్రి కావడానికి ఎటువంటి సమస్య ఉండదు. రోజూ ఒక గ్లాసు కలోంజీ పాలు తాగితే ఆరోగ్యానికి చాలా మంచిది.
రోగనిరోధక శక్తి పెరుగుతుంది
కలోంజి పాలు తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ గుణాల వల్ల సీజనల్ వ్యాధుల నుంచి దూరంగా ఉంటారు. ముఖ్యంగా జలుబు-దగ్గు విషయంలో మంచి రెమిడీలా ఉపయోగపడుతాయి.
బరువు తగ్గుతారు
కలోంజి పాలు బరువు తగ్గడానికి చాలా బాగా పనిచేస్తాయి. ఇది జీవక్రియను పెంచుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్ధకం సమస్య ఉంటే తొలగిపోతుంది. గర్భిణీలు తాగడం వల్ల రక్తహీనత ఉండదు. కడుపులో పెరుగుతున్న శిశువు ఎముకల అభివృద్ధికి సహాయపడుతాయి.
ఆస్తమాకి చెక్
కలోంజీ సీడ్స్ ను గ్రైండ్ చేసి తేనెతో కలిపి తీసుకుంటే మెమరీ బూస్ట్ అవుతుంది. వెచ్చటి నీటిలో కలిపి తీసుకుంటే ఆస్తమా లక్షణాలు శ్వాస సంబంధిత సమస్యలు తగ్గిపోతాయని నిపుణులు చెబుతున్నారు. ఐతే కనీసం 45 రోజుల పాటు ఈ రెమిడి పాటించాలి.