Health Tips: శరీరంలో ఈ సమస్యలుంటే యూరిక్‌యాసిడ్‌ పెరిగినట్లే.. ఇలా వదిలించుకోండి..!

Health Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది.

Update: 2023-02-09 14:30 GMT

Health Tips: శరీరంలో ఈ సమస్యలుంటే యూరిక్‌యాసిడ్‌ పెరిగినట్లే.. ఇలా వదిలించుకోండి..!

Health Tips: శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు చాలా ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. కొన్ని తప్పుడు ఆహారపు అలవాట్లు, మరికొన్ని మందులు తీసుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగినప్పుడు దానిని హైపర్యూరిసెమియా అంటారు. ఇటువంటి పరిస్థితిలో కీళ్ల నొప్పులు ఏర్పడుతాయి. ముఖ్యంగా చలికాలంలో దీని ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ స్థాయిని తెలుసుకోవడానికి చేసే పరీక్షను సీరమ్ యూరిక్ యాసిడ్ మెజర్‌మెంట్ అంటారు.

మనం టీ, కాఫీ, మాంసం, చేపలు, చాక్లెట్‌లను ఎక్కువగా తీసుకుంటే రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరుగుతుంది. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కూడా ఇలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే వైద్యుడిని సంప్రదించకుండా కొన్నిరకాల మందులు తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగే అవకాశం ఉంది. ఒక వ్యక్తికి దీర్ఘకాలిక కాలేయ వ్యాధి ఉంటే రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరుగుతుంది. చాలా సార్లు శరీరంలో ఎంజైమ్ లోపం ఉంటుంది. దీని కారణంగా హైపర్యూరిసెమియా ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది.

యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు కీళ్ల నొప్పులు వస్తాయని అందరికి తెలిసిందే. కానీ రక్తంలో దాని స్థాయిని అదుపులో ఉంచుకోకపోతే కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం ఉంది. అలాగే మూత్ర విసర్జనలో ఇబ్బందులు ఏర్పడుతాయి. యూరిక్ యాసిడ్ తగ్గించడానికి ఈరోజే మాంసం, చేపలు, కాఫీ, టీ, చాక్లెట్లకు దూరంంగా ఉండండి. బరువుని కంట్రోల్‌లో ఉంచుకోండి. రోజు 8 నుంచి 10 గ్లాసుల నీరు తాగే వారికి ఇలాంటి సమస్యలు రావు. నారింజ, నిమ్మరసం, ఉసిరికాయ వంటి విటమిన్ సి అధికంగా ఉండే వాటిని ఎక్కువగా తీసుకోవాలి.

Tags:    

Similar News