Lungs Disease Symptoms: ఈ లక్షణాలు కనిపిస్తే ఊపిరితిత్తులు ప్రమాదంలో పడినట్లే..!
Lungs Disease Symptoms:శరీరంలోని ప్రధాన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. ఇవి చెడిపోతే మనిషి బతకడం చాలా కష్టం.
Lungs Disease Symptoms: శరీరంలోని ప్రధాన అవయవాలలో ఊపిరితిత్తులు ఒకటి. ఇవి చెడిపోతే మనిషి బతకడం చాలా కష్టం. ఊపరితిత్తులు గాలిలోని ఆక్సిజన్‌ను శరీరానికి అందించడంతో పాటు శరీరంలోని కార్బన్‌డైయాక్సైడ్‌ను బయటికి పంపిస్తాయి. బాడీలో ఒక విసర్జక వ్యవస్థలా ఇవి పనిచేస్తాయి. కానీ కొన్ని చెడు అలవాట్ల వల్ల ఊపిరితిత్తులు పాడవుతు న్నాయి. ధూమపానం, కలుషితమైన గాలి పీల్చడం వల్ల ఎక్కువగా శ్వాసకోశ సమస్యలకు గురవుతున్నారు. ఈ రోజు ఊపిరితిత్తుల వ్యాధికి సంబంధించిన కొన్ని లక్షణాల గురించి తెలుసుకుందాం.
నడిచేటప్పుడు, మెట్లు ఎక్కేటప్పుడు గురకవచ్చినా, ఊపిరి తీసుకోవడం కష్టంగా మారినా ఇది ఊపిరితిత్తుల అనారోగ్యానికి కారణమని గుర్తించండి. ఒక్కోసారి నిద్రలో సడెన్‌గా శ్వాస ఆగిపోతుంది. కొందరిలో ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు గమనించినట్లయితే వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం ఉత్తమం. ఊపిరి పీల్చుకునేటప్పుడు నొప్పి, కష్టంగా అనిపించినా ఊపిరితిత్తులు ప్రమాదంలో ఉన్నాయని అర్థం. దగ్గు ఎనిమిది వారాల పాటు కొనసాగితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
రక్తంతో దగ్గడం, కఫం, నాసికా స్రావాలు ఉత్పత్తికావడం ఊపిరితిత్తుల వ్యాధికి సంకేతం అవుతుంది. ఆస్తమా, బ్రాంకైటిస్ వంటి సమస్యలు ఉన్నవారిలో కఫం ఎక్కువగా ఉంటుంది. దగ్గు, కఫం వరుసగా మూడు నెలలకు మించి తగ్గకపోతే అది ఊపిరితిత్తుల వ్యాధిగా గుర్తించాలి. మరో ప్రధాన లక్షణం ఛాతీ నొప్పి. గుండె జబ్బులు లేదా పొట్టలో పుండ్లు ఉన్నప్పుడు సాధారణంగా ఛాతీ నొప్పి వస్తుంది. అలాగే ఊపిరితిత్తుల సమస్యకు ఏర్పడినప్పుడు కూడా ఒక రకమైన ఛాతీ నొప్పి వస్తుంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లేదా రక్తం గడ్డకట్టడం వంటి సమస్యలు ఉన్నప్పుడు ఛాతీ నొప్పి వస్తుందని గుర్తుంచుకోండి.