Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే ఆహారం జీర్ణమవడం లేదు.. కుళ్ళిపోతున్నట్లు లెక్క..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది సమయపాలన లేకుండా తింటున్నారు. దీంతో తరచుగా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఆహారం జీర్ణమవడం అంత సులువైన పనికాదు.

Update: 2024-01-24 14:00 GMT

Health Tips: ఈ లక్షణాలు కనిపిస్తే ఆహారం జీర్ణమవడం లేదు.. కుళ్ళిపోతున్నట్లు లెక్క..!

Health Tips: ఈ రోజుల్లో చాలామంది సమయపాలన లేకుండా తింటున్నారు. దీంతో తరచుగా జీర్ణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. వాస్తవానికి ఆహారం జీర్ణమవడం అంత సులువైన పనికాదు. దీనికోసం పేగులలో చాలా ప్రక్రియలు జరగాల్సి ఉంటుంది. అయితే మనం తీసుకునే ఆహారాలను బట్టి జీర్ణమయ్యే సమయం ఉంటుంది. పండ్లు, ఆకుపచ్చ కూరగాయలు త్వరగా జీర్ణమవుతాయి. మాంసం, వేయించిన ఆహారాలు ఎక్కువ సమయం తీసుకుంటాయి. ఒక ఆహారం జీర్ణమైన తర్వాత మరో ఆహారం తీసుకుంటే పర్వాలేదు లేదంటే మొదట తీసుకున్న ఆహారం కుళ్లిపోతుంది. దీనివల్ల శరీరంలో చాలా సమస్యలు ఎదురవుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.

జీర్ణక్రియ ప్రక్రియ

ఆహారం నోటిలోకి ప్రవేశించినప్పుడు నోటిలో లాలాజలం ఉత్పత్తి అవుతుంది. ఇందులో డైజెస్టివ్ ఎంజైమ్‌లు ఉంటాయి. ఇవి ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడతాయి. దీని తర్వాత ఆహారం ఆహార నాళం గుండా కడుపులోకి వెళుతుంది. ఇక్కడ ఆహారం జీర్ణం కావడానికి రెండున్నర నుంచి నాలుగు గంటలు పడుతుంది. కడుపు గ్యాస్ట్రిక్ యాసిడ్‌ను విడుదల చేస్తుంది. ఆహారం చిన్న ముక్కలుగా విరిగి పేస్ట్‌గా మారుతుంది. తరువాత ప్రేగులలోని గ్రంథులు ఆహారం నుంచి పోషకాలను గ్రహిస్తాయి. చిన్న ప్రేగు విటమిన్లు, B-12, ఖనిజాలు, కాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లను గ్రహిస్తుంది. తర్వాత ఆహారం నుంచి 90 శాతం పోషకాలు గ్రహించబడతాయి. అవశేషాలు పెద్ద ప్రేగు గుండా మలం రూపంలో బయటకు వస్తాయి. ఆహారం జీర్ణం కానప్పుడు అది కడుపులో కుళ్లిపోతుంది. ఈ పరిస్థితిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి.

1. ఆకలి లేకపోవడం

ఆహారం సరిగా జీర్ణం కానప్పుడు అది పేగు గోడలకు అంటుకుంటుంది. ఈ పరిస్థితిలో మొదట ఆకలి అనిపించదు. కడుపులో పురుగులు పెరుగుతాయి ప్రేగులకు హాని కలిగిస్తాయి.

2. రాళ్లు

జీర్ణం కాని ఆహారం ఘనపదార్థంగా మారుతుంది. శరీరంలోని వివిధ భాగాలలో స్టోర్‌ అవుతుంది. తర్వాత అది ఒక తిత్తిని ఏర్పరుస్తుంది. ఇది మూత్రపిండాలు, పిత్తాశయంలోకి వెళ్లి రాళ్లలా మారుతాయి.

3. ఊబకాయం

వేగంగా బరువు పెరగడం కూడా కారణం అవుతుంది. స్థూలకాయం అనేది శరీరం ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసుకోలేకపోవడానికి సంకేతం. వ్యర్థాలు, మిగిలిన ఆహార భాగాలు శరీర భాగాలలో పేరుకుపోయి ఊబకాయానికి కారణమవుతాయి.

Tags:    

Similar News