Diabetic Patients: డయాబెటిక్ పేషెంట్లు తేనెను ఎలా తీసుకోవాలి.. ఈ పద్దతులు అనుసరించండి..!
Diabetic Patients: దేశంలో రోజు రోజుకు డయాబెటిక్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు దీనికి కారణమవుతున్నాయి.
Diabetic Patients: దేశంలో రోజు రోజుకు డయాబెటిక్ పేషెంట్లు పెరిగిపోతున్నారు. జీవన విధానం, ఆహారపు అలవాట్లు దీనికి కారణమవుతున్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తుల రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల వారు చాలా సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. డయాబెటిస్‌తో బాధపడే రోగులు తీపి అస్సలు తినకూడదు. అయితే ఇందులో నిజం లేదు ఎందుకంటే రోగికి ఉన్న చక్కెర స్థాయిని బట్టి స్వీట్లు ఆహార పదార్థాలను డాక్టర్లు సూచిస్తారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు చక్కెరను ఉపయోగించడం నిషేధం. అయితే తేనెను ఉపయోగించవచ్చు. దీన్ని తీసుకునేముందు ఒకసారి ఆరోగ్య నిపుణుల సలహా తీసుకోవాలి.
తేనె ప్రయోజనకరం
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం తేనె ఆరోగ్యానికి ఎక్కువ ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఇది తెల్ల చక్కెర కంటే తొందరగా జీర్ణమవుతుంది. తేనెలో ఎంజైమ్‌లు ఉంటాయి దీని కారణంగా శరీరం తేనెను సులభంగా విచ్ఛిన్నం చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు కొంత తేనెను తీసుకోవడానికి ఇదే కారణం.
ఈ విషయాలను గుర్తుంచుకోండి
తేనె కొనేందుకు వెళ్లినప్పుడు అందులో షుగర్ సిరప్ కలగకుండా చూసుకోవాలని డైటీషియన్లు చెబుతున్నారు. మార్కెట్‌లో లభించే తేనె కల్తీ అయి ఉంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఒక చెంచా తేనె కంటే ఎక్కువ తినకూడదు. తెల్ల చక్కెర కంటే తేనె తక్కువ గ్లైసెమిక్ కలిగి ఉంటుంది. తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఉపయోగపడుతుంది.
వైద్యుడిని సంప్రదించండి
అయితే తేనెను తినే ముందు ఎంత మోతాదులో తీసుకోవాలో డాక్టర్ ను సంప్రదించి తెలుసుకోవాలి. రోగులందరి చక్కెర స్థాయి ఒకేలా ఉండకపోవచ్చు. అందువల్ల ఎంత తేనె మీకు హానికరం కాదు అనే విషయం డాక్టర్ మాత్రమే చెప్పగలరు.