వేసవి విడిది కోసం ఆంధ్రా 'ఊటి'కి వెళ్లాల్సిందే
Horsley Hills: సమ్మర్ హాలీడేస్ వస్తే చాలు జాలీగా కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటాం.
Horsley Hills: సమ్మర్ హాలీడేస్ వస్తే చాలు జాలీగా కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కడికైనా వెళ్లాలని అనుకుంటాం. సరదాగా ఫ్యామిలీతో కలిసి సమ్మర్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటాం. దాని కోసం ఊటీ నో, లేక కొడైకనలో వెళ్లాలని నిర్ణయించుకుంటాం. అయితే ఆనందాలకు నెలవైన ప్రదేశాలు ఏపీలో అనేకం ఉన్నాయి. ముఖ్యంగా ప్రకృతి అందాలను వీక్షించాలనుకునేవారికి హార్సిలీ హిల్స్ ఓ అద్బుతమై ప్రదేశం. ఆంధ్రా ఊటీ అని కూడా దినిని అంటారు. దీనినే ఏనుగు మల్లమ్మ కొండ అని కూడా అంటారు.
రాష్ట్రంలోకెల్లా ఎత్తైన ప్రదేశం హార్సిలీ హిల్స్ లోనే ఉంది. ఏనుగు మల్లమ్మ కొండ (హార్సిలీ హిల్స్) చూడచక్కని ప్రదేశం. ఎటుచూసినా కొండలుకోనల సోయగాలు, పొడవాటి నీలగిరి జాతుల వృక్షాలు, ఆ మధ్యన తారాడే సెలయేటి జలపాతాలు.. ఇలా ప్రకృతి సమేత సౌందర్యం హార్సిలీహిల్స్ సొంతం. అంతేకాదు, ఇక్కడి వైవిద్యభరితమైన వాతావరణం పర్యాటకులకు ఓ సరికొత్త అనుభూతి.
హార్సిలీ హిల్స్ వెళ్లే మరో మార్గం ఎంతో సుదంరంగా ఉంటుంది. ఈ మార్గంలోని కొండలు రెండు వైపులా నీలగిరి (యూకలిప్టస్) వంటి అనేక జాతుల చెట్లతో కళ్లకు ఇంపుగా ఉంటుంది. జింకలు, చిరుతపులుల వంటి వన్యమృగాలు కూడా ఈ ప్రాంతంలో సంచరిస్తుంటాయి. ప్రముఖ రచయిత, తత్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి నెలకొల్పిన 'రిషివ్యాలీ విద్యాలయం' ఇక్కడే ఉంది.
ఎనుగు మల్లమ్మ కొండ చరిత్ర:
గతంలో ఈ హిల్స్‌ను ఏనుగు మల్లమ్మ కొండ అని పిలుస్తారు. దీనికి వెనక కథ విషయానికి వస్తే.. గిరిజన జాతులు మరియు రోగాల బారిన పడిన వ్యక్తుల కోసం శ్రద్ధ తీసుకునేది. ఆమె ఒక రోజు అకస్మాత్తుగా అదృశ్యమవడంతో గిరిజన ప్రజలు తన కోసం ఒక ఆలయం నిర్మించాలని నిర్ణయించారు. మరో కథ చూస్తే.. మల్లమ్మ చిన్న పిల్లగా ఉన్నప్పుడు ఏనుగులు రక్షించాయి, అందుకే ఏనుగు మల్లమ్మ కొండ అని పేరు వచ్చింది. ఇక్కడికి విడిది కోసం వచ్చిన బ్రిటిష్ గవర్నర్ అయిన డబ్ల్యూ.డి. హార్సిలీ ఇక్కడ బంగ్లా నిర్మించుకున్నాడు. అప్పటినుంచి ఈ ప్రాంతానికి 'హార్సిలీ హిల్స్' అనే పేరు వచ్చింది. అయితే వేసవిలో చల్లటి విడిది కోసం ఒక్కసారానైనా ఈ హిల్స్ కి వెళ్లాల్సిందే.
ఎలా చేరుకోవాలి:
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ప్రదేశం చిత్తూరు జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 29 కిలోమీటర్ల దూరంలో ఉంది. చిత్తూరు జిల్లాలో ఈ హీల్స్ చాలా ప్రజాదరణ పొందిన వేసవి హిల్ రిసార్ట్. ఈ రిసార్ట్ కు బెంగుళూర్, హైదరాబాద్ మరియు తిరుపతి వంటి దక్షిణ ప్రధాన నగరాల నుంచి సులభంగా చేరుకోవచ్చు బెంగళూరు నుంచి 160 కి.మీ., తిరుపతి నుంచి 140 కి.మీ. దూరంలో ఉంది. సముద్ర మట్టానికి 1,314 మీ ఎత్తులో ఉంది. చలికాలంలో 3 డిగ్రీల సెంటీగ్రేడు నుంచి మండు వేసవిలో 32 డిగ్రీల సెంటీ గ్రేడు వరకు ఉష్ణోగ్రత ఉంటుంది.
మదనపల్లె నుంచి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రైవేట్ ట్యాక్సీల్లో కూడా వెళ్లొచ్చు. పర్యాటకుల కోసం కొండపైన అతిథి గృహాలు కూడా ఏర్పాటు చేశారు. ఏప్రిల్ మరియు మే నెలల్లో వేడి పతాక స్థాయిలో ఉన్నప్పుడు ఈ ప్రాంతానికి పర్యాటకులు ఎక్కువగా వస్తారు. ఈ సుందరమైన పర్వతం వేడి వాతావరణం నుంచి బాగా అవసరమైన ఉపశమనం ను కలిగిస్తుంది.
కరోనా కారణంగా గత ఏడాది ఈ ప్రదేశానికి వచ్చే యాత్రికుల సంఖ్య తగ్గిపోయింది. అయితే ఈ సారి ఈ ప్రాంతానికి వచ్చే ప్రయాణికులు వ్యక్తిగత జాగ్రత్తలు తీసుకోవాలని రిసోర్ట్స్ యాజమాన్యం గుర్తుచేస్తుంది. కరోనా రూల్స్ విడిది ప్రదేశంలో అమల్లో ఉంటాయని వారు తెలుపుతున్నారు. ఈ సారి మాత్రం ఒక నెలరోజులు మందు నుంచే పర్యాటకులు హార్సిలీ హిల్స్ కు చేరుకుంటున్నారు. PradeshPradesh