Benefits of Coriander: తరచుగా కొత్తిమీర తీసుకోవటం వల్ల కలిగే ప్రయోజనాలు..
Benefits of Coriander: ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. ఇది మంచి సువావన కలిగి ఉంటుంది.
Benefits of Coriander: ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. ఇది మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో ఎక్కువగా వాడతారు. మన తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వాడుతారు. దీని శాస్త్రీయ నామము " Coriandrum sativum ". దీనిని ఏదో ఆహార పదార్ధాలపై అలంకరించాడానికి మత్రమే వాడుతారు అనుకుంటే పొరపాటే.. కొతిమీర నిండా ఎన్నో విటమిన్లు మరియు ఖనిజ ఉంటాయి. కొత్తిమీరను కేవలం వంటింటి పదార్థంగా మాత్రమే కాకుండా కొత్తిమీరను ఔషధంగా కూడా వాడవచ్చు.
కొత్తిమీర మొక్క కాండంలోనూ, ఆకుల్లోనూ, గింజల్లోనూ సుగంధ తత్వాలూ, ఔషధ తత్వాలూ అనేకం ఉంటాయి. ఈమధ్య జరిగిన అధ్యయనాల్లో కొత్తిమీర ఫుడ్ పాయిజనింగ్‌లో అత్యంత ప్రయోజనకారిగా పనిచేస్తుందని తేలింది. తాజాగా సేకరించిన కొత్తిమీరలో డుడిసినాల్ అనే పదార్థం ఉంటుంది. ఇది ఆహారాన్ని విషతుల్యం చేసే సాల్మనెల్లా బ్యాక్టీరియాని నిర్వీర్యపరుస్తుందని గమనించారు. కొసమెరుపేమిటంటే, సాధారణంగా ఫుడ్ పాయినింగ్‌లో జెంటామైసిన్ వాడుతుంటారు. అయితే దీనికన్నా కొత్తిమీర ప్రభావవంతంగా, సురక్షితంగా పనిచేసినట్లు రుజువయ్యింది. అంతే కాదు కొత్తిమీర మనం కురల్లోనే కాకుండా దీనిని పచ్చడిగా కూడా చేసుకుని వాడవచ్చు.
కొత్తిమీర వల్ల ఉపయోగాలు..
* బీపీని తగ్గిస్తుంది.
* రక్తంలో చక్కర స్థాయిని తగ్గిస్తుంది.
* కొత్తిమీరలో ఉండే యాంటి ఆక్సిడెంట్ మన శరీర కణాలను కాపాడుతుంది.
* గుండె సంబందిత జబ్బులు రాకుండా కాపాడుతుంది.
* నాదీ వ్యవస్థ దెబ్బతినకుండా కాపాడుతుంది.
* విపరీతమైన ఎండల వల్ల చర్మం పాడవకుండా లోలోపల నుండి కొత్తిమీర అడ్డుకుంటుంది.
* పొగతాగడం , కేమోతెరఫి వల్ల కలిగే నష్టము తగ్గించడానికి పోరాడుతుంది.
* కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది.