Health Benefits with Ponnaganti leaves: పొన్నగంటి కూరతో ఆరోగ్య ప్రయోజనాలు...

Health Benefits with Ponnaganti leaves | పొన్నగంటి కూర, ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర.

Update: 2020-09-03 04:09 GMT

Ponnaganti leaves

Health Benefits with Ponnaganti leaves | పొన్నగంటి కూర, ఇది మంచి పోషక విలువలు గలిగిన ఆకుకూర. ఇది పొన్నగంటి కూర (Alternanthera sessilis) అమరాంథేసి కుటుంబానికి చెందిన ఒక ఆకుకూర.దీనిని పప్పులో వేయడం కన్నా వట్టిదే వేయించి తింటే చాలా రుచికరంగా వుంటుంది. ఇది అతి సులభంగా, అతి తొందరగా అభివృద్ధి చెందే ఆకు కూర. దీనికి విత్తనాలు వుండవు. ఇది కేవలం కాండం ద్వారా అభివృద్ధి చెందగలదు.పొన్నగంటి కూర ఆకులు ఏడాది పొడవునా లభిస్తాయి. బరువు తగ్గాలనుకునే వారు ఈ ఆకు కూరను తరచూ తింటే మంచిది. ఇందులో కొలెస్ట్రాల్ ఉంటుంది. తరచూ తీసుకోవడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

పొన్నగంటి ఆకుల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటుని తగ్గించి, గుండె సమస్యల్ని అదుపులో ఉంచుతాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ చేరుకోకుండా కాపాడతాయి. ఆస్తమా, బ్రాంకైటీస్‌తో బాధపడేవారు పొన్నగంటి రసంలో తేనె కలిపి తీసుకుంటే మంచిది. దీన్లో లభించే క్యాల్షియం ఎముకల ఎదుగుదలకూ, ఆస్టియోపోరోసిస్ వంటి వాటిని దూరం చేయడానికీ ఉపయోగపడుతుంది. ఈ ఆకుల్లోని కొన్ని పోషకాలు శరీరంలోని క్యాన్సర్ కారకాలతో పోరాడతాయి. గౌట్ వ్యాధి, మూత్రపిండాల సమస్యలతో బాధపడేవారు వైద్యుల సలహాతోనే దీన్ని తీసుకోవాలి. ఒకసారి కూర చేశాక పదే పదే వేడి చేయడం సరికాదు. ఒక్కోసారి వికారానికి దారి తీసే ప్రమాదం ఉంది.

పొన్నగంటితో ఉపయోగాలు..

* పొన్నగంటి కూరను పలురకాలుగా కూరలుగా వాడతారు.

* జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఔషధ చికిత్సగా ఉపయోగిస్తారు.

* ఆయుర్వేద ఔషధంలో వంటిలోని రుగ్మతలను శుభ్రపరిచేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు.

* పురాతన పుస్తకాలు, భారతీయ వైద్య గురువులు చెప్పిన దాని ప్రకారం పొన్నగంటి కూర ఆకులు నలభై ఎనిమిది రోజులు తింటే, కీలకమైన ఖనిజాలు, పోషకాల అధిక కంటెంట్‌ను అందిస్తుందని, ఇది కళ్ళను పోషించడంలో సహాయపడుతుందని, చర్మం సహజమైన సౌందర్యాన్ని కలిగిస్తుందని తెలుస్తుంది..

* థైలాం అని పిలువబడే పొన్నంగంటి నూనె శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటుందని, భారతదేశంలో అధిక శరీర వేడి, తలనొప్పికి తగ్గటానికి ఉపయోగిస్తారని తెలుస్తుంది.

* జుట్టుకు పోషణనిచ్చే బయోటిన్‌ దీనిలో సమృద్ధిగా ఉంటుంది.

పొన్నగంటిలోని పోషక విలువలు...

పొన్నగంటి కూర ఆకులునందు ఆరోగ్యానికి మేలు చేసే బీటా కెరోటిన్, ఐరన్, ఫైబర్, కాల్షియం, విటమిన్లు సి, ఎ లకు మంచి మూలం. ఇంకా విటమిన్ 'ఎ', 'బి6', 'సి', ఫొలేట్, 'రైబోఫ్లెవిన్', పొటాషియం, ఐరన్, మెగ్నీషియం దీని నుంచి సమృద్ధిగా దొరకుతాయి.


Tags:    

Similar News