Health Benefits of Saffron: కుంకుమ పువ్వుతో ఆరోగ్య ప్రయోజనాలు..

Health Benefits of Saffron: కుంకుమ పువ్వు (Saffron) ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు.

Update: 2020-08-28 03:07 GMT

Saffron Flower

Health Benefits of Saffron: కుంకుమ పువ్వు (Saffron) ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము. ఇరిడాసే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతలీ ప్రదేశాల్లో పండిస్తారు. కుంకుమపువ్వులో ఉపయోగపడే భాగం - ఎర్ర కేసరాలు మాత్రమే. ఒక కిలో కేసరాలు తయారు చేయాలంటే కనీసం రెండు లక్షల పూలు అవసరమవుతాయి. అందుకే కుంకుమ పువ్వు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సుగంధ ద్రవ్యము. కేసరాలు రుచికి కొద్దిగా చేదుగా, తియ్యగా వుంటాయి.

కుంకుమ పువ్వు గర్భిణులు ఆహారంలో తీసుకుంటే పుట్టే బిడ్డ నల్లగానో, చామనఛాయతోనో కాక తెల్లగానో, ఎర్రగానో పుడతుందని ప్రాచుర్యంలోని విశ్వాసం. అయితే అది సరికాదని, తల్లిదండ్రుల జన్యువులు (దాన్ని వారు జీవించే ప్రదేశం ప్రభావితం చేస్తుంది) తప్ప కుంకుమపువ్వు వంటి ఆహార విషయాలు బిడ్డ రంగును నిర్ణయించడంలో ఏ ప్రభావం చూపలేవని వైద్యులు, పరిశోధకులు చెప్తున్నారు.

కుంకుమ పువ్వు ఉపయోగాలు..

* కుంకుమ పువ్వు రంగు పదార్ధంగాను, సువాసనకారిగాను అనేక తినుబండారాలు, తాంబూలంలోనూ వాడతారు.

* కుంకుమ పువ్వు నేత్ర వ్యాధులలోను, ముక్కు సంబంధమైన వ్యాధులలోను మందుగా పనిచేస్తుంది. యాభైకి పైబడుతున్నవారు ఆహారంలో కుంకుమపువ్వు తీసుకుంటే కంటికి మేలని వైద్యుల సూచన.

* ప్రతిదినం కుంకుమ పువ్వును, తేనెను తెల్లవారుఝామున సేవిస్తే ధాతుపుష్టికి, వీర్యవృద్ధికి పనిచేస్తుంది.

* కుంకుమ పువ్వు గంధంలా తయారుచేసి ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం సున్నితంగా ఆకర్షణీయంగా తయారవుతుంది.

* కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు ఉన్నాయి.

వైద్య పరంగా ఉపయోగాలు...

కుంకుమ పువ్వు జీర్ణశక్తిని పెంచుతుంది.రక్తప్రసరణను మెరుగుపరిచి రక్తపోటును తగ్గి స్తుంది.కుంకుమ పువ్వును పూర్వం చైనీయుల వైద్యంలో విరివిగా వాడేవారు. వారు ఎక్కు వగా కాలేయ సామార్థ్యాన్ని పెంచేందుకు ఉపయోగించేవారు.ఆయుర్వేదంలో ఉదరం పని తీరును మెరుగుపరిచేందుకు, జీర్ణక్రియ సంబంధిత సమస్యల నివారణకు ఉపయోగి స్తారు.ఆలిని క్రమబద్ధీకరించేందుకు, జీర్ణరసాల ప్రసరణకు, మోనోపాజ్‌ సమస్యల చికి త్సకు కూడా కుంకుమపువ్వును వినియోగిస్తారు. దగ్గు, కడుపుబ్బరం చికిత్సకూ వాడతారు. శారీరక రుగ్మతలతో పాటు డిప్రెషన్‌ను కూడా కుంకుమ పువ్వు తొలగిస్తుంద శరీరంలో కామోద్ధీపనలను పెంచే న్యూరో-ట్రాన్స్‌మిటర్లను, డోపమైన్‌ ఫైన్లను వృద్ధి చేస్తుంది.

పోషక విలువలు..

కుంకుమ పువ్వులో క్రోసిన్, క్రోసిటిన్, పిక్రో క్రోసిన్ మొదలైన గ్లూకోసైడులు ఉన్నాయి. వీటితో పాటు బీటా, గామా కెరోటిన్ లు, లైకోఫీనులు అనే రసాయనాలు ఉన్నాయి.

శక్తి - 15.5%,

కార్బోహైడ్రేట్స్ - 50%,

ప్రోటీన్స్ -  21%,

ఫ్యాట్స్ - 21%,

విటమిన్స్ -  77%,

మినరల్స్ -  37%

Tags:    

Similar News