Health Benefits: ప్రతి రోజు కోవీ పండు తినటం వల్ల కలిగే ప్రయోజనాలు..
Health Benefits: కివీ పండు అనేది 'యాక్టినిడియా చైనిన్సెస్' అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. ఈ రకమైన పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు.
Health Benefits: కివీ పండు అనేది 'యాక్టినిడియా చైనిన్సెస్' అనే తీగ జాతి మొక్కకు కాసే పండు. ఈ రకమైన పళ్ళను న్యూజిలాండ్ వంటి చల్లని దేశాల్లో పండిస్తారు. చైనీస్ గూస్బెర్రీస్ అని కూడా పిలుబడే కివీ కాయలు చూడటానికి ముదురు గోధుమ రంగు జూలుతో కోడి గ్రుడ్డు ఆకారంలో వుండి, లోపల అనేక గింజలతో నిండిన ఆకు పచ్చని లేదా పసుపు పచ్చని గుజ్జు కలిగివుంటుంది. ఈ మధ్య భారతీయ నగర మార్కెట్లలో యాపిల్ పండంత ఖరీదులో లభిస్తున్నాయి. కమలాలకు రెట్టింపు 'విటమిన్ సి', ఆపిల్‌లోకన్నా అయిదు రెట్లు ఎక్కువ పోషకాలూ దీని సొంతం. పీచు పదార్థం, విటమిన్ ఇ, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, కెరోటినాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మరెన్నో పోషకాల నిలయం 'కివీ' పండు.
న్యూజిలాండ్‌లో మాత్రమే పండే కివీలు ఇప్పుడు మన మార్కెట్‌లోనూ విరివిగా దొరుకుతున్నాయి. కొవ్వులూ, సోడియం తక్కువగా ఉండటంవల్ల హృద్రోగులూ, మధుమేహ వ్యాధిగ్రస్తులూ కూడా దీన్ని తినొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు. బరువు తగ్గించుకోవాలనుకునేవారికీ ఇది మంచి నేస్తమే. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలవల్ల బీపీ, కొలెస్ట్రాల్ అదుపులో ఉంటాయి. పోషకాలే కాదు, నోరూరించే రుచి కూడా కివీ సొంతం.
కివి మొక్కలు సమశీతోష్ణ మండలాల్లో, అనగా వాతావరణంలో ఎండాకాలానికి చలికాలానికి మధ్య మోస్తరు తేడా మాత్రమే ఉన్న ప్రదేశాల్లో పెరుగుతాయి. అందుకే వీటిని ఇటలీ, న్యూజిలాండ్, చిలీ, ఫ్రాన్స్, గ్రీస్, జపాన్, ఇరాన్, అమెరికా, కంబోడియా వంటి దేశాల్లో సాగు చేస్తున్నారు. ఇటీవల భారతదేశంలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సాగు చేస్తున్నారు. కివీ పండ్లతో ప్రయోజనాలోన్నో. దీని తొక్కను తీసి పారేస్తుంటాం. కానీ అందులో చాలా విషయం ఉంది. తొక్కు వెనుక యాంటీ ఆక్సిడెం ట్లు పూర్తి పీచు పదార్థంతో నిండిన గుజ్జు ఉంటుంది. మొక్కజొన్నను మినహా యిస్తే.. కంటి చూపును కాపాడే లుటియి న్ పదార్థ్ధం ఏ ఇతర పండు, కూరగాయాల్లో కూడా ఇందులో ఉన్నంత ఉండదు. రోజుకు రెండు నుంచి మూడు కివీలు తిన్నవారిలో శరీరం లోప ల రక్తం గడ్డకట్టే ప్రమాదం తగ్గినట్లు నార్వేలో గుర్తించారు.
కివీ పండులోని పోషక విలువలు:
* షుగర్సు 8.99 గ్రా,
* కార్బోహైడ్రేట్లు 14.66 గ్రా,
* లుటీన్, క్సాన్థిన్ 122 మైక్రో గ్రా,
* రైబోఫ్లోవిన్ 0.025 మిగ్రా,
* ఫేట్ 0.52 గ్రా,
* ఫైబర్ 3.0 గ్రా,
* ఫోలేట్ 25 మైక్రో గ్రా,
* ప్రొటీన్ 1.14 గ్రా,
* విటమిన్ ఇ 1.5 మిగ్రా,
* విటమిన్ సి 92.7 మిగ్రా,
* ధయామిన్ 0.027 మిగ్రా,
* కేల్షియమ్ 34 మిగ్రా,
* ఐరన్ 0.31 మిగ్రా,
* విటమిన్ కే 40.3 మైక్రో గ్రా,
* ఫాస్పరస్ 34 మిగ్రా,
* సోడియం 3 మిగ్రా,
* జింక్ 0.14 మిగ్రా,
* పొటాషియం 312 మిగ్రా,
* మెగ్నిషియమ్ 17 మిగ్రా ఉన్నాయి.