Health Benefits of Beetroot: బీట్‌రూట్ తో ఆరోగ్య ప్రయోజనాలు...
Health Benefits of Beetroot | బీటు దుంప (ఆంగ్లం: Beetroot) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక రకమైన మొక్క.
Health Benefits of Beetroot | బీటు దుంప (ఆంగ్లం: Beetroot) పుష్పించే మొక్కలలో ద్విదళబీజాలకు చెందిన ఒక రకమైన మొక్క. ఇది చెనోపోడియేసి కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం బీటా వల్గారిస్. వీనిని వేరు రూపాంతరంగా పెరిగే దుంపల కోసం పెంచుతారు. ఈ బీటుదుంపలను కూరగాయగా, చక్కెర తయారీ కోసం, పశుగ్రాసంగా ఉపయోగిస్తారు. బీటు మొక్కలలో మూడు ఉపజాతులను గుర్తించారు.
అవి: బీటా వల్గారిస్ వల్గారిస్, సిక్లా, మారిటిమ. దీని శాస్త్రీయ నామము " beta vulgaris" . ఆకులు, దుప, రెండు తినేందుకు వాడతారు . టేబుల్ షుగర్ తయారీలో బీటు దుంపను వాడుదురు . "batanins " అనే పదార్ధముతో పేస్టు, జాం, ఐస్ క్రీం వంటి వాటి కలర్ ను ఇంప్రూవ్ చేయడానికి పనివచ్చును . శక్తినిచ్చే శాకందుంపల్లో బీట్‌రూట్‌ది ప్రత్యేక స్థానం. ఇది కనులకు ఇంపుగా కనిపించడమే కాదు. ఆరోగ్యానికి ఎంతో మంచిది కూడా. ఎనీమియాతో బాధపడేవారు రోజూ ఒక కప్పుడు బీట్‌రూట్ రసం తాగితే త్వరగా కోలుకుంటారు.
వైద్య పరమైన ఉపయోగాలు...
* డయాబెటిక్ లివర్ ను కాపాడును,
* కొలెస్టిరాల్ ను తగ్గించును,
* మలబద్దకాన్ని నివారించును,
* బీట్ రూటు రసము రక్తపోటును తగ్గించు .
* బోరాన్ ఎక్కువగా ఉన్నందున "aphrodisiac "గా సెక్స్ హోర్మోన్స్ ఎక్కువచేయును .
* కొంతవరకు కాన్సర్ నివారణకు ఉపయోగ పదును .
అధిక రక్తపోటుతో బాధపడుతున్నారా? అయితే బీట్‌రూట్ రసాన్ని తాగండి. ఎందుకంటే ఇది అధిక రక్తపోటును బాగా తగ్గిస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందులోని నైట్రేట్లు రక్తంలో కలిశాక నైట్రిక్ ఆక్సైడ్‌ను ఉత్పత్తి చేస్తాయి. ఈ వాయువు రక్తనాళాలను విప్పారేలా చేసి రక్తపోటు తగ్గేందుకు దోహదం చేస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉండటానికీ తోడ్పడుతుంది. కాబట్టి రోజూ 250 మి.గ్రా. పచ్చి బీట్‌రూట్ రసాన్ని తాగితే మేలు జరుగుతుంది.
బీట్ రూట్ లోని పోషక విలువలు..
మాయిశ్చర్ : 87.7 %,
ప్రోటీన్లు : 1.7 %,
ఖనిజాలు : 0.8%,
పీచు : 0.9%
కార్బోహైడ్రేట్స్ : 8.8%,
కాల్సియం : 18 మి.గ్రా,
ఫాస్పరస్ : 55 మి.గా,
ఐరన్ : 1.0 మి.గా,
జింక్ : 0.2%,
థయామిన్ : 0.04%,
రిబోఫ్లేమిన్ : 0.09%,
నియాసిన్ : 0.4 మి.గా ,
విటమిన్ సి : 10%,
కాలరీస్ : 43 కేలరీలు,