Health Benefits Myrobalan: కరక్కాయతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు...

Health Benefits Myrobalan| కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. చెబ్యులిక్ మైరోబాలన్, హరిటాకి, హారార్డ్ అనేవి ఇతర పేర్లు.

Update: 2020-09-02 04:50 GMT

Karakkaya (Myrobalan or Terminalia chebula)

Health Benefits Myrobalan| కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. చెబ్యులిక్ మైరోబాలన్, హరిటాకి, హారార్డ్ అనేవి ఇతర పేర్లు. ఇది 6-20 మీటర్ల ఎత్తువరకు పెరిగే వృక్షం. పత్రాలు కణుపు ఒకటి లేదా రెండు చొప్పున పొడవుగా, దాదాపు కోలగా ఉంటాయి. పుష్పాలు తెలుపు లేదా లేతాకుపచ్చ రంగులో సన్నని కంకులపై నక్షత్రాలవలె వస్తాయి. ఫలాలు కోలగా ఉండి, ఎండితే నిడుపాటి నొక్కులను కలిగి ఆగస్టు నుంచి అక్టోబరు వరకు లభిస్తాయి. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరక్కాయ లేదా కరక ఔషధ జాతికి చెందిన మొక్క. కరక్కాయత్రిఫలాలలో ఒకటి. ఇది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

లక్షణాలు...

* నలుపు గోధుమ రంగు బెరడుతో పెరిగే పెద్ద వృక్షం.

* అండాకారం నుండి విపరీత అండాకారం గల సరళ పత్రాలు.

* శాఖాయుతమైన కంకులలో అమరిన ఆకుపచ్చతో కూడిన పసుపు రంగు పుష్పాలు.

* నొక్కులున్న ఆకుపచ్చతో కూడిన పసుపురంగు ఫలాలు.

దగ్గును తగ్గించే కరక్కాయ...

* దగ్గుతో బాధపడుతున్న పిల్లలకు పెద్దలకు కరక్కాయ రసం తాగిస్తుంటారు.

* కరక్కాయలోని ఔషధ గుణాలు దగ్గుతో పాటు పలురకాల జబ్బులను నయం చేస్తాయి.

* గొంతులోని శ్లేష్మాన్ని హరించి కంఠ సమస్యలను నివారిస్తుంది. అందుకే ప్రతి తెలుగింట్లో కచ్చితంగా కరక్కాయ ఉంటుంది.

కరక్కాయలోని ఔషధ గుణాలు...

కరక్కాయలు విలువైన జౌషధ గుణాలను కలిగివుంటాయి. వీటిలో యంత్రాక్వినోన్లు, టానిన్లు, ఛెబ్యులిక్ ఆమ్లం, రెసిన్, స్థిర తైలం మొదలనవి ఉంటాయి. అన్ని రకాల జీర్ణకోశ వ్యాధులు, అస్తమా, దగ్గు, వాంతులు, కంటి వ్యాధులు, గుండె జబ్బుల నివారణకు ఉపయోగపడుతుంది. దగ్గు నివారణకు కరక్కాయ వాడటం ప్రముఖ గృహ వైద్యం. ఆయుర్వేద వైద్యంలో దీన్ని విరివిగా వాడతారు.

కరక్కాయతో ఉపయోగాలు...

* కరక్కాయ చూర్ణాన్ని రోజువారీగా మోతాదుకు టీ స్పూన్ చొప్పున రెండు పూటలా సమాన భాగం బెల్లంతోగాని, అర టీస్పూన్ శొంఠి పొడితో గాని, పావు టీ స్పూన్ సైంధవ లవణంతో గాని కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

* కరక్కాయలు, పిప్పళ్లు, సౌవర్చలవణం వీటిని సమానంగా తీసుకొని విడివిడిగా పొడిచేసి, అన్నీ కలిపి నిల్వచేసుకొని మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి తీసుకుంటే ఆకలి పెరుగుతుంది.

* పేగుల్లోనూ, ఛాతి భాగంలోనూ, గొంతు భాగంలోనూ మంటగా అనిపిస్తుంటే కరక్కాయ చూర్ణాన్ని ఎండు ద్రాక్షతో కలిపి నూరి తేనె, చక్కెర చేర్చి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.

* అజీర్ణంతో ఇబ్బంది పడుతున్నప్పుడు, పరిపూర్ణమైన బలంతో ఉన్నవారు ఆహారానికి గంట ముందు కరక్కాయ చూర్ణాన్ని, శొంఠి చూర్ణాన్ని సమభాగాలుగా కలిపి టీ స్పూన్ మోతాదుగా, అర కప్పు నీళ్లతో తీసుకోవాలి.

* కరక్కాయలు, పిప్పళ్లు, శొంఠి వీటిని త్రిసమ అంటారు. వీటిని సమాన భాగాలుగా చూర్ణంగాచేసి తీసుకుంటే ఆకలి పెరగటమే కాకుండా అతి దప్పిక నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

* కరక్కాయ చూర్ణాన్ని, వేపమాను బెరడు చూర్ణాన్ని సమాన భాగాలుగా కలిపి మోతాదుగా అర టీ స్పూన్ చొప్పున అర కప్పు నీళ్లతో కలిపి రెండుపూటలా తీసుకుంటే ఆకలి పెరగటంతోపాటు చర్మంమీద తరచూ తయారయ్యే చీముగడ్డలు, చర్మ సంబంధమైన ఫంగల్ ఇనె్ఫక్షన్లు, తామరచర్మ రోగాలూ వీటన్నిటినుంచీ ఉపశమనం లభిస్తుంది. 

Tags:    

Similar News