Black Turmeric: నల్ల పసుపుని ఎప్పుడైనా ఉపయోగించారా.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Black Turmeric: భారతదేశంలో పసుపుని ఉపయోగించన వ్యక్తి దాదాపుగా ఉండడు అని చెప్పాలి.
Black Turmeric: భారతదేశంలో పసుపుని ఉపయోగించన వ్యక్తి దాదాపుగా ఉండడు అని చెప్పాలి. ప్రతి ఇంటి వంట గదిలో పసుపు చాలా ముఖ్యమైన భాగం. ఇది లేకుండా రుచికరమైన వంటలు వండలేరు. అయితే ఎప్పుడైనా నల్ల పసుపు గురించి విన్నారా..దీనిని భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలలో పండిస్తారు. ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది చర్మానికి ఔషధం కంటే తక్కువేమి కాదు. నల్ల పసుపు ఉపయోగాల గురించి ఈ రోజు తెలుసుకుందాం.
1. గాయాలు వెంటనే మానిపోతాయి
చిన్న చిన్న దెబ్బలు, గాయాలకి చాలామంది స్కిన్ క్రీమ్‌లను ఉపయోగిస్తారు. కానీ ఆయుర్వేద చికిత్స ప్రకారం నల్ల పసుపు పేస్ట్‌ను అప్లై చేస్తే గాయాలు త్వరగా మానుతాయి
2. జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది
నల్ల పసుపు కడుపు సమస్యలకు మంచి మందు అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఎవరికైనా కడుపు నొప్పి లేదా గ్యాస్ సమస్య ఉంటే నల్లపసుపుని ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని పొడిగా చేసి నీటిలో కలుపుకుని త్రాగాలి.
3. చర్మానికి మెరుపు
సాధారణ పసుపులాగే నల్ల పసుపు కూడా చర్మానికి మేలు చేస్తుంది. దీనిని తేనెతో కలిపి ముఖానికి రాసుకుంటే విపరీతమైన గ్లో వస్తుంది. ఇది కాకుండా ముఖంపై ఉండే నల్ల మచ్చలు, మొటిమలను తొలగిస్తారు.
4. కీళ్ల నొప్పుల ఉపశమనం
వయసు పెరిగే కొద్దీ కీళ్ల నొప్పులు రావడం సర్వసాధారణం. నల్ల పసుపును పేస్ట్ చేసి ప్రభావిత ప్రాంతాలలో రాస్తే వాపు నుంచి ఉపశమనం లభిస్తుంది. నల్ల పసుపులో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి.