Beauty Tips: ఎండవల్ల చర్మం వాడిపోయిందా.. ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేస్తే మళ్లీ మునుపటిలా తయారవుతారు..!
Beauty Tips: వేసవిలో ఎండవల్ల ముఖం వాడిపోతుంది. దుమ్ము, ధూళి, చెమట వల్ల చర్మంపై టాన్ పేరుకుపోతుంది.
Beauty Tips: వేసవిలో ఎండవల్ల ముఖం వాడిపోతుంది. దుమ్ము, ధూళి, చెమట వల్ల చర్మంపై టాన్ పేరుకుపోతుంది. ఈ పరిస్థితిలో చర్మాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఇందుకోసం సమ్మర్ స్పెషల్ ఫేస్ ప్యాక్‌ని ట్రై చేయవచ్చు. దీనిని టొమాటో, కాఫీ, తేనె సహాయంతో తయారుచేస్తారు. టొమాటోలో బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. కాబట్టి ఇది ముఖంలోని టానింగ్‌ను తొలగిస్తుంది. కాఫీ ముఖంలోని మురికిని తొలగించి గ్లోను పెంచుతుంది. తేనెలో ఉండే లక్షణాలు చర్మాన్ని మృదువుగా చేస్తాయి. లోతైన పోషణని అందిస్తాయి. అయితే దీనిని ఏ విధంగా తయారుచేయాలో ఈరోజు తెలుసుకుందాం.
సమ్మర్ స్పెషల్ ఫేస్ ప్యాక్ చేయడానికి ముందుగా టొమాటోలను తీసుకోవాలి. బాగా కడిగి రెండు భాగాలుగా కట్ చేసుకోవాలి. తరువాత చేతిలో ఒక టమోటా తరిగిన భాగాన్ని పట్టుకోవాలి. దీని లోపల అర టీస్పూన్ కాఫీ, 1 టీస్పూన్ తేనె వేయాలి. తర్వాత చేతితో ముఖంపై ఈ మూడింటిని కలిపి అప్లై చేయాలి. 5 నుంచి 7 నిమిషాల పాటు రుద్దుతూ మసాజ్ చేయాలి. తరువాత ముఖంపై 5 నిమిషాలు అలాగే వదిలేయాలి. కొద్దిసేపటికి చల్లటి నీళ్లతో ముఖాన్ని కడుక్కోవాలి. తరువాత ముఖంపై క్రీమ్ లేదా లోషన్స్ తప్పనిసరిగా అప్లై చేయాలని గుర్తుంచుకోండి.
వారంలో మూడుసార్లు ఇలా చేస్తే చర్మం మునుపటి మెరుపుని సంతరించుకుంటుంది. గ్లో పెరుగుతుంది. మృదువుగా తయారవుతుంది. నల్లటి మచ్చలు, మొటిమలు తొలగిపోతాయి. ఈ ఫేస్ ప్యాక్ తయారుచేయడానికి పెద్దగా ఖర్చుకూడా ఏమికాదు. సహజసిద్దమైన పదార్థాలు కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అన్ని ఇంట్లోనే సులువుగా లభిస్తాయి. తరచుగా ఇలా చేయడం వల్ల యవ్వనంగా కనిపిస్తారు.