Kurdi Vilage: ఏడాదికి ఒక్క నెల మాత్రమే కనిపించే గ్రామం..ఎక్కడుందో తెలుసా?

Kurdi Vilage: 1980లలో మునిగిపోయిన కుర్ది గ్రామం, సలౌలిమ్ ఆనకట్ట పరివాహక ప్రాంతం నుండి దాదాపు 5 కి.మీ దూరంలో ఉన్న సంగూమ్‌లో ఉంది. సంవత్సరానికి ఒకసారి..అంటే ఏప్రిల్, మేలలో వేసవి నెలల్లో, నీటి మట్టం తగ్గడంతో కనిపించని గ్రామం మళ్లీ కనిపిస్తుంది. ఈ గ్రామం మూడు నుండి నాలుగు వారాల పాటు కనిపిస్తుంది. ఈ నెలరోజుల పాటు కుర్తి గ్రామ నివాసితులు తమ గ్రామాన్ని సందర్శిస్తారు. తాము ఉన్న ఇండ్లు, ప్రాంతాలు, గుర్తులను చూసి సంబురపడుతుంటారు.

Update: 2024-08-04 07:59 GMT

Kurdi Vilage: ఏడాదికి ఒక్క నెల మాత్రమే కనిపించే గ్రామం..ఎక్కడుందో తెలుసా?

 Kurdi Vilage:ప్రతి సంవత్సరం కేవలం ఒక నెల (లేదా అంతకంటే తక్కువ) మాత్రమే కనిపించే గోవాలోని కుర్ది లేదా కర్డి గ్రామం చాలా ప్రసిద్ధి చెందింది. 1980లలో సలౌలిమ్ ఆనకట్ట ఫలితంగా ఒక రిజర్వాయర్ ఏర్పడినప్పుడు కుర్డి గ్రామం మునిగిపోయింది. నివాసితులందరూ గోవాలోని వివిధ ప్రాంతాలకు తరలివెళ్లి అక్కడే స్థిరపడ్డారు. కుర్ది గ్రామం.. సలౌలిమ్ డ్యామ్ పరివాహక ప్రాంతం నుండి దాదాపు 5 కి.మీ దూరంలో ఉన్న సంగ్యూమ్‌లో ఉంది. సంవత్సరానికి ఒకసారి, ఏప్రిల్,మేలలో వేసవి నెలల్లో, నీటి మట్టం తగ్గడంతో కనిపించని గ్రామం మళ్లీ కనిపిస్తుంది. ఈ పునరుద్ధరణ మూడు నుండి నాలుగు వారాల పాటు కొనసాగుతుంది. ఈ సమయంలో కుర్డి గ్రామంలోని పాత నివాసితులు తమ ఒకప్పుడు తాము నివసించి ఇళ్లను..పరిసర ప్రాంతాలను చూసేందుకు అక్కడికి వెళ్తుంటారు. తమ జ్నాపకాలను నెమరు వేసుకుంటారు.

కుర్ది అనే చిన్న గ్రామం ఒకప్పుడు సారవంతమైన భూమితో సుసంపన్నమైన ప్రదేశం. ఇక్కడ సుమారు 3 వేల మంది నివాసితులు వరి, ఇతర పంటలు పండించేవారు. ఈ గ్రామంలో అన్ని మతస్తులవారు జీవనంసాగించేవారు. మసీదు,చర్చిలు, దేవాలయాలతో గ్రామం ఎంతో అందంగా ఉండేది. అయితే దక్షిణగోవాలోని కొన్ని ప్రాంతాల్లో నీటికోరత ఏర్పడింది. తాగు, నీటిపారుదల, పారిశ్రామిక పరిశ్రమలకు 400 మిలియన్ లీటర్ల నీరు అవసరం. అప్పటి ముఖ్యమంత్రి దయానంద్ బందోద్కర్ ఆనకట్ట నిర్మించాలని నిర్ణయించారు. 1986లో కుర్ది గ్రామంలో పర్యటించిన ముఖ్యమంత్రి అక్కడ డ్యామ్ నిర్మిస్తామని గ్రామ ప్రజలకు చెప్పారు. ఈ ప్రాంతంలో డ్యామ్ నిర్మిస్తే దక్షిణ గోవా మొత్తానికి మేలు జరుగుతుందని నిర్ణయించుకున్న గ్రామస్తులు తమ గ్రామాన్ని ఖాళీ చేసేందుకు అంగీకరించారు. గ్రామస్థుల సహాయంతో సలోలిమ్ నీటిపారుదల ప్రాజెక్టును అక్కడ నిర్మించారు. ఈ ప్రాజెక్టు సలోలిమ్ నదికి సమీపంలో ఉంటుంది. అందుకే ఈ గ్రామానికి సలోలిమ్ అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన తర్వాత కుర్ది గ్రామం నీటమునిగింది. ఆ గ్రామాన్ని వదిలి వెళ్లి నివాసితులు గోవాతో పాటు ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు.

ఆ గ్రామ ప్రజలకు మే నెల చిరస్మరణీయం. ఎందుకంటే ఇది తిరిగి వాళ్ల ఊరికి తిరిగి వచ్చే సమయం. ఈ మాసంలో అందరూ జష్రా జరుపుకుంటారు. క్రిస్టియన్ కమ్యూనిటీ వార్షిక చాపెల్ భోజనం చేస్తారు. ఈ మాసంలో హిందువులు ఆలయంలో విందులు జరుపుకుంటారు. ఈ రోజు ఈ గ్రామం శిథిలావస్థకు చేరినప్పటికీ, ఇక్కడ నివసిస్తున్న ప్రజలకు ఇది వారి స్వంత గ్రామం. ప్రతి ఏటా ఈ గ్రామాన్ని అద్భుతంగా తమ కళ్లముందుకు తెచ్చేది వారి ప్రేమే అని స్థానికులు ఇప్పటికీ భావిస్తున్నారు.

Tags:    

Similar News