Navratri 2022: ఉపవాసం ఉంటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే అలసట ఉండదు..!

Navratri 2022: ఉపవాసం ఉంటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే అలసట ఉండదు..!

Update: 2022-09-27 15:30 GMT

Navratri 2022: ఉపవాసం ఉంటున్నారా.. ఈ చిట్కాలు పాటిస్తే అలసట ఉండదు..!

Navratri 2022: నవరాత్రి అనేది భక్తి శ్రద్ధలతో కూడిన పండుగ. తొమ్మిది రోజులూ పూజలు, అర్చనలు, ఉపవాసాలు చేస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని చాలామంది నమ్ముతారు. అయితే ఉపవాసం చేయడం వల్ల శరీరంలో బలహీనత ఏర్పడుతుంది. ఇలాంటి సమయంలో కొన్ని కొన్ని సులభమైన చిట్కాలను పాటించాలి. అప్పుడు ఉపవాస సమయంలో బలహీనత ఉండదు. సరైన శక్తితో నిండి ఉంటారు. వాటి గురించి తెలుసుకుందాం.

1. ఆహారం తగ్గించండి

నవరాత్రులలో ఉపవాసం ఉండాలని ప్లాన్ చేస్తే ఆహారం తీసుకోవడం తగ్గించండి. ముందుగానే ఆహారం తగ్గించినట్లయితే శరీరం తక్కువ తినడానికి అలవాటుపడుతుంది. దీంతో బలహీనత ఉండదు.

2. ఎక్కువ నీరు తాగండి

నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. దీని వల్ల శరీరంలో తగినంత శక్తి ఏర్పడుతుంది. తరచూ కొన్ని నీళ్లు తాగుతూ ఉండాలి. ఇది మిమ్మల్ని అలసట, బలహీనత సమస్య నుంచి దూరం చేస్తుంది. చికాకు, తలనొప్పి సమస్య ఉండదు.

3. స్వీట్లు తినవద్దు

ఉపవాసానికి ముందు చక్కెరతో చేసిన తీపి పదార్థాల వినియోగాన్ని తగ్గించండి. తీపి పదార్థాలు ఎక్కువగా తింటే శరీరంలో గ్లూకోజ్ పరిమాణం ఎక్కువవుతుంది. ఆహారాన్ని హఠాత్తుగా ఆపివేయడం వల్ల గ్లూకోజ్ కొరత ఏర్పడుతుంది. ఇది ఆకలిని కలిగిస్తుంది. గ్లూకోజ్ లేకపోవడం శక్తి తగ్గుతుంది. దీని కారణంగా శరీరం అలసిపోతుంది.

4. జిమ్, వ్యాయామం మానుకోండి

ఉపవాస సమయంలో శారీరక శ్రమలు తగ్గించుకోవాలి. నవరాత్రులలో ఉపవాసం ఉంటే యోగా, వ్యాయామం చేయడం మానుకోండి. ఉపవాస రోజుల్లో జిమ్‌కు వెళ్లడం మానుకోవాలి. ఎందుకంటే శక్తిని ఎక్కువగా ఉపయోగిస్తే బలహీనత వస్తుంది.

Tags:    

Similar News