BP: ఎంత ట్రై చేసినా బీపీ తగ్గడంలేదా.? సింపుల్‌గా తగ్గించుకోండి..

బీపీ అటాక్‌ కాగానే చాలా మంది తప్ప మందులను ఉపయోగిస్తుంటారు. కచ్చితంగా ప్రతీ రోజూ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే.

Update: 2024-08-28 15:30 GMT

BP: ఎంత ట్రై చేసినా బీపీ తగ్గడంలేదా.? సింపుల్‌గా తగ్గించుకోండి.. 

అధిక రక్తపోటు ఇటీవల సర్వసాధారణ సమస్యగా మారింది. ఒకప్పుడు 50 ఏళ్లు నిండిన వారిలో మాత్రమే కనిపించే ఈ సమస్య ప్రస్తుతం 30 ఏళ్ల వారిలో కూడా కనిపిస్తోంది. మారిన జీవన విధానం, తీసుకుంటున్న ఆహారంలో మార్పుల కారణంగా బీపీతో బాధపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా ఉప్పు ఎక్కువగా తినడం, ఒత్తిడితో కూడుకున్న జీవనశైలి కారణంగా బీపీ బాధితుల సంఖ్య ఎక్కువుతోంది.

బీపీ అటాక్‌ కాగానే చాలా మంది తప్ప మందులను ఉపయోగిస్తుంటారు. కచ్చితంగా ప్రతీ రోజూ ట్యాబ్లెట్ వేసుకోవాల్సిందే. అయితే మందులతో పాటు జీవన శైలిలో కొన్ని రకాల మార్పులను చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాంటి కొన్ని మార్పుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉప్పును వీలైనంత వరకు తగ్గించాలి. ఉప్పు శరీరంలో మరింత ఎక్కువ నీటిని పట్టి ఉంచుతుంది. దీంతో రక్తం పరిమాణం పెరిగి, ధమనుల మీద పీడనం ఎక్కువవుతుంది. దీంతో బీపీకి కారణమవుతుంది.

ఇక బీపీ తగ్గాలంటే పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే పొటాషియం మూత్రం ద్వారా ఒంట్లోంచి సోడియాన్ని బయటకు పంపిస్తుంది. బీపీని కంట్రోల్ చేయడంలో క్యాల్షియం కీలకపాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. క్యాల్షియం రక్తనాళాలు బిగుతుగా, వదులుగా అయ్యేలా చూడటంలో ఉపయోగపడుతుంది. శరీరంలో క్యాల్షియం పెరగడానికి పెరుగును తీసుకోవాలి.

సాల్మన్‌ వంటి చిన్న చేపల ముల్లులోనూ క్యాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అలాగే కొవ్వుతో కూడిన చేపలతో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలూ లభిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో గుమ్మడి, అవిసె, పొద్దు తిరుగుడు గింజలు ఎంతో ఉపయోపడుతాయి. ఇందులోని మెగ్నీషియం రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బీట్‌రూట్ సైతం రక్తపోటును అదుపు చేస్తుంది.

Tags:    

Similar News