Ayurvedic Tips: ఈ ఆయుర్వేద చిట్కాలతో మతిమరుపుకి చెక్.. అద్భుత ఫలితాలు..!

Ayurvedic Tips: జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడానికి కొన్ని ఆయుర్వేద మూలికలను తీసుకోవచ్చు

Update: 2022-11-27 09:10 GMT

Ayurvedic Tips: ఈ ఆయుర్వేద చిట్కాలతో మతిమరుపుకి చెక్.. అద్భుత ఫలితాలు..!

Ayurvedic Tips: నేటి రోజుల్లో మనుషుల్లో మతిమరుపు వేగంగా పెరుగుతోంది. దీనివల్ల ప్రజలు ఏకాగ్రతతో పని చేయలేకపోతున్నారు. దీనికి కారణం చెడు జీవనశైలి. వృద్ధాప్యంలో మతిమరుపు సమస్య మామూలే కానీ యువతలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. నేటి వేగవంతమైన జీవితంలో మానసికంగా ఆరోగ్యంగా ఉండటం అవసరం. లేదంటే వెనుకబడిపోతారు. జ్ఞాపకశక్తి, ఏకాగ్రతను పెంచడానికి కొన్ని ఆయుర్వేద మూలికలను తీసుకోవచ్చు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

బ్రహ్మి

బ్రహ్మి ఒక పురాతన మూలిక. ఇది ఔషధ గుణాలతో నిండి ఉంటుంది. దీనిని ఆయుర్వేదంలో వేల సంవత్సరాలుగా ఉపయోగిస్తున్నారు. ఇది మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఈ మూలిక ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. బ్రాహ్మి తినడం వల్ల జ్ఞాపకశక్తి,, ఏకాగ్రత పెరుగుతాయి. దీన్ని తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయి. పాలు లేదా నీటిలో కలిపి బ్రహ్మీ పొడిని తీసుకోవచ్చు

శంఖుపుష్పం

ఆయుర్వేద వైద్యంలో శంఖపుష్పి చాలా శక్తివంతమైన మూలికగా చెబుతారు. దీనిని ఏళ్ల తరబడి ఔషధంగా వినియోగిస్తున్నారు. ఇది మనస్సును శాంతపరచడానికి, జ్ఞాపకశక్తిని మెరుగుపరచడానికి ఉపయోగిస్తారు. ఇది ఒత్తిడి, ఆందోళనను తొలగించడానికి పనిచేస్తుంది. మీరు గోరువెచ్చని నీటిలో ఒక చెంచా ఈ మూలికా పొడి కలిపి తినవచ్చు.

అశ్వగంధ

అశ్వగంధ మానసిక, శారీరక ఒత్తిడిని తగ్గించడానికి పనిచేస్తుంది. ఇది మెదడులో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది జ్ఞాపకశక్తిని పెంచడానికి మాత్రమే కాకుండా మెదడు వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడానికి పనిచేస్తుంది. పాలు, నీళ్లు, తేనె, నెయ్యి కలిపి తీసుకోవచ్చు.

తులసి

తులసి ఉత్తమ మూలికలలో ఒకటి. ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధి. ఇందులో యాంటీబయాటిక్, యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ కార్సినోజెనిక్ లక్షణాలు ఉంటాయి. ఇది అనేక ఆరోగ్య సమస్యల నుంచి రక్షించడానికి పనిచేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి,, ఏకాగ్రతను పెంచడానికి పనిచేస్తుంది. దీని కోసం మీరు 5 నుంచి 10 తులసి ఆకులు 5 బాదం, 5 నల్ల మిరియాలు తేనెతో తినవచ్చు. ఇది జ్ఞాపకశక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

Tags:    

Similar News