Health Tips: అవిసెగింజలు అతిగా తింటే ఈ సమస్యలు..!

Health Tips: అవిసెగింజలు అతిగా తింటే ఈ సమస్యలు..!

Update: 2022-09-08 16:30 GMT

Health Tips: అవిసెగింజలు అతిగా తింటే ఈ సమస్యలు..!

Health Tips: కరోనా దెబ్బకి సమాజంలో చాలా మంది ఫిట్‌నెస్ గురించి ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా మార్కెట్‌లో తేలికగా లభించే అవిసె గింజలను ఎక్కువగా తీసుకుంటున్నారు. ఈ చిన్న గింజలలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణక్రియ ఆరోగ్యంగా ఉంటుంది. పెరుగుతున్న బరువును తగ్గించడం కూడా సులభం. అవిసె గింజలలో ఫైటోకెమికల్స్,లిగ్నాన్స్, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మన శరీరానికి చాలా మేలు చేస్తాయి. ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ అవిసె గింజల అధిక వినియోగం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. దాని గురించి తెలుసుకుందాం.

1. కడుపులో ఆటంకాలు

మీరు అవిసె గింజలను ఎక్కువగా తీసుకుంటే డయేరియా, ప్రేగు సిండ్రోమ్ సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ప్రేగులలో ఇబ్బంది ఉన్నవారు అవిసెగింజలని తినకూడదు. దీని కోసం మీరు డైటీషియన్ సలహా తీసుకోవచ్చు.

2. మలబద్ధకం సమస్యలు

అవిసె గింజలను ఎక్కువగా తింటే ప్రేగులలో అడ్డంకులు ఏర్పడుతాయి. ఇవి ఆరోగ్యానికి ఎంత మేలు చేసినా నియంత్రించడం కూడా అవసరం.

3. అలర్జీ సమస్యలు

అవిసె గింజలను ఎక్కువగా తీసుకునే వ్యక్తులు అలర్జీల బారిన పడుతారు. దీని కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మీకు అవసరమైనంత పరిమాణంలో అవిసె గింజలను తీసుకోవడం మేలు.

Tags:    

Similar News