Children Super Foods: పిల్లలకు పరగడుపున ఈ ఫుడ్స్‌ తినిపించండి.. వ్యాధులకు దూరంగా ఉంటారు..!

Children Super Foods: చలికాలంలో పిల్లలను జాగ్రత్తగా గమనించాలి. ఈ సీజన్‌లో వారు తొందరగా జబ్బుపడే అవకాశాలుంటాయి.

Update: 2024-01-27 01:30 GMT

Children Super Foods: పిల్లలకు పరగడుపున ఈ ఫుడ్స్‌ తినిపించండి.. వ్యాధులకు దూరంగా ఉంటారు..!

Children Super Foods: చలికాలంలో పిల్లలను జాగ్రత్తగా గమనించాలి. ఈ సీజన్‌లో వారు తొందరగా జబ్బుపడే అవకాశాలుంటాయి. ఎందుకంటే చలికాలంలో ఇమ్యూనిటీ పవర్‌ తగ్గతుంది ఇది పిల్లల్లో ఎక్కువగా జరుగుతుంది. అందుకే వారికి మెరుగైన ఆహారాన్ని అందించాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండేలా చూసుకోవాలి. పిల్లల ఆరోగ్యం వారు తీసుకునే ఆహారం మీద ఆధారపడి ఉంటుందని తల్లిదండ్రులు గుర్తుంచుకోవాలి. ప్రతిరోజు ఉదయం పిల్లలకు పరగడుపున కొన్ని ఆహారాలు తినేలా చూడాలి. దీనివల్ల ఎల్లప్పుడూ ఫిట్‌గా ఉంటారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం.

పిల్లలు ఫిట్‌గా ఉండటానికి ప్రతిరోజు పోషకాహారం అందించాలి. విటమిన్లు, ఖనిజాలు, కొవ్వులు సమృద్ధిగా ఉండే ఆహారాలను తినిపించాలి. పరగడుపున బాదంపప్పు తినేలా చేయాలి. దీనివల్ల శరీరాన్ని బలం చేకూరుతుంది. పిల్లలను ప్రతిరోజూ యాపిల్స్ తినేలా ప్రోత్సహించాలి. పిల్లల కంటి చూపును మెరుగుపరచడంలో ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. యాపిల్స్‌లో కాల్షియం, ఐరన్, జింక్ అధిక మొత్తంలో ఉంటాయి.

పిల్లలు ప్రతిరోజూ ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగేలా అలవాటు చేయాలి. ఇలా చేయడం వల్ల అన్ని రోగాలు నశిస్తాయి. బిడ్డ లోపల నుంచి ఫిట్‌గా ఉంటాడు. అరటి పండును పరగడుపుతో తినేలా చూడాలి. ఇది కడుపు సమస్యలను దూరం చేయడంలో సహాయం చేస్తుంది. బలహీనమైన పిల్లలకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కాయ ధాన్యాలు ప్రోటీన్‌కు ఉత్తమమైనవిగా చెబుతారు. బరువు తగ్గడానికి ఇవి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పిల్లలకు ప్రతిరోజు ఏదైనా పప్పు అందించాలి.

Tags:    

Similar News