Health Tips: తగినంత నిద్రపోయినా నీరసంగా ఉంటుందా..!

Health Tips: శరీరానికి విశ్రాంతి కావాలంటే నిద్ర అవసరం. అయితే సరిపోయేంత నిద్ర పోయినా నీరసంగా అనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి.

Update: 2022-11-02 12:11 GMT

Health Tips: తగినంత నిద్రపోయినా నీరసంగా ఉంటుందా..!

Health Tips: శరీరానికి విశ్రాంతి కావాలంటే నిద్ర అవసరం. అయితే సరిపోయేంత నిద్ర పోయినా నీరసంగా అనిపిస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా సార్లు నిద్ర నుంచి లేచిన తర్వాత శరీరంలో నొప్పులు మొదలవుతాయి. తల నొప్పిగా ఉంటుంది. శరీరంలో కొన్ని పోషకాలు లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో ఈ రోజు తెలుసుకుందాం.

లేచిన తర్వాత నీరు తాగాలి

శరీరంలోని కణాలు చురుగ్గా ఉండాలంటే నీరు తాగడం అవసరం. ఉదయాన్నే నీరు తాగడం వల్ల శరీరానికి శక్తి వస్తుంది. అందుకే ఉదయాన్నే నీళ్లు తాగాలి. సాధారణ లేదా గోరువెచ్చని నీరు రెండింటినీ తాగవచ్చు. నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేట్ కావడమే కాకుండా అనేక సమస్యలను దూరం చేస్తుంది.

యోగాతో సోమరితనం తొలగిపోతుంది

శరీరం ఆరోగ్యవంతంగా చురుకుగా ఉండటానికి యోగా బాగా పనిచేస్తుంది. నిద్ర పోయిన తర్వాత కూడా బద్ధకం, అలసట కొనసాగితే యోగా చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది. నడుము, భుజాలలో నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. మానసిక ఒత్తిడిని తొలగించడానికి యోగాతో పాటు ధ్యానం కూడా చేయవచ్చు.

వ్యాయామం బద్ధకాన్ని తొలగిస్తుంది

ఉదయాన్నే బద్ధకం రావడం సహజం. నిద్రలేచిన తర్వాత శరీరం చురుకుగా మారడానికి కొంత సమయం పడుతుంది. మీరు ఆలస్యంగా మేల్కొంటే సోమరితనం మరింత పెరుగుతుంది. ఈ పరిస్థితిలో బద్ధకం తొలగించడానికి లేచిన తర్వాత వ్యాయామం చేయాలి. అధిక విశ్రాంతి కారణంగా శరీరంలో నొప్పి, అలసట భావన ఉంటుంది. అప్పుడు 5-10 నిమిషాల వ్యాయామం పెద్ద ప్రయోజనాన్ని ఇస్తుంది.

Tags:    

Similar News