Health Tips: గుడ్డు తినడం వల్ల ఈ 3 లోపాలు తొలగిపోతాయి.. కానీ ఏ పద్దతిలో తినాలంటే..?
Health Tips: గుడ్లను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. భారతదేశంలో చాలా మంది గుడ్లను మాంసాహారంగా భావించి తినరు.
Health Tips: గుడ్లను సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. భారతదేశంలో చాలా మంది గుడ్లను మాంసాహారంగా భావించి తినరు. కానీ గుడ్లు ఎలర్జీ లేని వారికి చాలా మేలు చేసే ఆహారం అని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. గుడ్లు శరీరానికి చాలా ముఖ్యమైన ప్రోటీన్లు, విటమిన్లు, ఖనిజాలను సమృద్ధిగా అందిస్తాయి. గుడ్లు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. వాటి గురించి తెలుసుకుందాం.
గుడ్లలో ఉండే పోషకాలు
గుడ్డులో పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ ఎ, విటమిన్ బి2, విటమిన్ బి12, విటమిన్ బి5, ఫాస్పరస్, సెలీనియం, విటమిన్ డి, జింక్, కాల్షియం మొదలైన పోషకాలు ఉంటాయి. నిజానికి గుడ్డులో ఉండే పోషకాలు శరీరంలోని ఏర్పడే లోపాలను సరిచేస్తాయి.
ప్రోటీన్ లోపం
గుడ్లు శరీరానికి చాలా ముఖ్యమైన ప్రోటీన్లను అందిస్తాయి. ప్రోటీన్ కండరాలను నిర్మిస్తుంది. జుట్టు, గోళ్లను బలపరుస్తుంది శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుంది.
జ్ఞాపకశక్తి బూస్ట్
గుడ్లలో ఉండే కోలిన్ మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కోలిన్ జ్ఞాపకశక్తి, అభ్యాస సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కంటి చూపు
గుడ్లలో ఉండే లుటిన్, జియాక్సంతిన్ కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ రెండు పోషకాలు కంటిశుక్లం ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
గుడ్లు తినడానికి మార్గం
గుడ్లను చాలా మార్గాల్లో తినవచ్చు. వీటిలో అత్యంత మంచి మార్గం ఉడికించిన గుడ్లు తినడం. ఉడకబెట్టిన గుడ్లలోని అన్ని పోషకాలు ఉంటాయి. అదే సమయంలో గుడ్డు వేయించాలనుకుంటే తక్కువ నూనెలో వేయించాలి. అందులో ఎక్కువ నూనె వాడకూడదు.ఎందుకంటే ఇది గుడ్డులో కేలరీలు, కొవ్వు మొత్తాన్ని పెంచుతుంది.
గుడ్లు తినడానికి సరైన సమయం
గుడ్లు తినడానికి ఉత్తమ సమయం ఉదయం. అల్పాహారంలో గుడ్లు తినడం వల్ల రోజంతా శరీరానికి శక్తి లభిస్తుంది. గుడ్లు లంచ్ లేదా డిన్నర్‌లో కూడా తినవచ్చు. ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఒకటి లేదా రెండు గుడ్లు తినాలి. మీకు గుడ్లు అలర్జీ కాకపోతే రోజుకు మూడు గుడ్లు కూడా తినవచ్చు.