Health Tips: మంచిది కదా అని గుడ్లు అతిగా తినకూడదు. ఈ సమస్యలు ఎదురవుతాయి..!
Health Tips: మంచిది కదా అని గుడ్లు అతిగా తినకూడదు. ఈ సమస్యలు ఎదురవుతాయి..!
Health Tips: చలికాలమైనా, వేసవికాలమైనా గుడ్లు తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఎక్కువగా తింటే ఇవి కూడా ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. గుడ్లలో ప్రోటీన్, విటమిన్ B12, అనేక యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. అయితే ఈ ఆహారాన్ని పరిమితంగా తినడం మంచిది. ఎక్కువగా తీసుకుంటే శరీరం ఈ సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. వాటి గురించి తెలుసుకుందాం.
లూజ్ మోషన్: గుడ్డులోని పసుపు భాగంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుంది. ఒక రోజులో ఎక్కువ గుడ్లు తీసుకుంటే లూజ్ మోషన్ సంభవిస్తుంది. అందుకే జిమ్‌కు వెళ్లేవారు గుడ్డులోని తెల్లని భాగాన్ని మాత్రమే తింటారు.
గుండెపోటు ప్రమాదం: గుడ్డులోని పసుపు భాగం అధికంగా తీసుకోవడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుతుంది. దీనివల్ల వల్ల గుండెపోటు ప్రమాదం ఉంది.
గ్యాస్ సమస్య: గుడ్లు శరీరంలో గ్యాస్ సమస్యలను కలిగిస్తుంది. ప్రజలు మూడు నుంచి నాలుగు గుడ్ల ఆమ్లెట్‌ను తిన్నప్పుడు గ్యాస్ లేదా శరీరంలోని ఇతర భాగాలలో నొప్పి ఉంటుంది.
చక్కెర స్థాయి: సూపర్‌ఫుడ్‌గా పరిగణించబడే గుడ్డు శరీరంలోని ఇన్సులిన్‌కు ఆటంకం కలిగిస్తుంది. ఈ సమస్య చాలాకాలం కొనసాగితే మధుమేహం సంభవిస్తుంది.