Health Tips: కలబంద అందానికే కాదు ఆరోగ్యానికి కూడా.. ప్రయోజనాలు తెలిస్తే అస్సలు వదలరు..!
Health Tips: కలబందలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి.
Health Tips: కలబందలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. ఇది అందంతో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది. కలబంద జుట్టు, చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దీనిని అనేక సంవత్సరాల నుంచి ఔషధాల తయారీలో వాడుతున్నారు. కలబందను కాలిన గాయాలు, జీర్ణక్రియ సమస్యల పరిష్కారానికి ఉపయోగిస్తారు. కలబందను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా ఎలాంటి ప్రయోజనాలు పొందుతారో ఈరోజు తెలుసుకుందాం.
1. జీర్ణక్రియకు ఉత్తమం
కలబంద తింటే జీర్ణక్రియ సజావుగా జరుగుతుంది. ఇందులో పోషకాల శోషణకి సహాయపడే ఎంజైమ్‌లు ఉన్నాయి. ఇది శోథ నిరోధక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది కడుపు ఉబ్బరం, మలబద్ధకం, పేగు సిండ్రోమ్ వంటి జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది.
2. రోగనిరోధక వ్యవస్థ
కలబందలో పాలీశాకరైడ్‌లు ఉంటాయి. ఇవి సంక్లిష్ట చక్కెరలు. రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు వీటిలో ఉంటాయి. ఈ పాలీసాకరైడ్‌లు తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. ఇవి ఇన్‌ఫెక్షన్, వ్యాధులతో పోరాడటానికి బాగా పనిచేస్తాయి.
3. బరువు తగ్గడం
అలోవెరా జెల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్, డిటాక్సిఫైయింగ్ లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. ఇది జీర్ణక్రియ, రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గడానికి పరోక్షంగా ఉపయోగపడుతుంది.
4. పోషకాలు సమృద్ధి
కలబంద అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది. ఇందులో విటమిన్ ఎ, సి, ఇ అలాగే కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి.
అలోవెరాను ఇలా తీసుకోండి
1. కలబందను సలాడ్‌లు, సూప్‌లలో కలుపుకొని తీసుకోవచ్చు.
2. అలోవెరా జెల్ ను ఉదయాన్నేపెరుగులో కలుపుకొని తినవచ్చు.
3. మీరు కలబందను పండ్ల రసంలో కూడా కలుపుకొని తీసుకోవచ్చు.